నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది.. | German man scorned by ex-wife cuts possessions in half, sells them on eBay | Sakshi
Sakshi News home page

నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది..

Jun 20 2015 10:28 AM | Updated on Sep 3 2017 4:04 AM

నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది..

నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది..

నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది అంటూ ఓ జర్మన్ యువకుడు.. మాజీ భార్యపై వెరైటీగా తన అక్కసు తీర్చుకున్నాడు.

బెర్లిన్ : నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది అంటూ ఓ  బాయ్ఫ్రెండ్...మాజీ భార్యపై వెరైటీగా తన అక్కసు తీర్చుకున్నాడు. జర్మనీకి చెందిన ఓ యువకుడు .. లారా అనే మాజీ భార్యపై కోపంతో ... గతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నింటినీ సగానికి కోసేశాడు.  తన గుండె ఒక్కటి మాత్రమే కాదు.. సమస్తం విరిగిపోయింది అని తన మాజీ భార్యకు చెప్పాలనుకున్నాడో ఏమో.


తాము ప్రయాణించిన కారు దగ్గర నుంచి... కూర్చునే కుర్చీ వరకూ అతగాడు ఏదీ వదలలేదు. టీవీ, సీడీలు, లాప్టాప్, సెల్ఫోన్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, సోఫా, బెడ్, చివరకు టెడ్డీ బేర్ బొమ్మను కూడా సగానికి చక్కగా కోసేసి... మాజీ భార్యకు పంపించాడు. అంతేకాకుండా ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసీ యూట్యూబ్లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడటంతో అయ్యగారు తన వద్ద మిగిలి ఉన్న మిగతా సగ భాగాలను ఈబే మార్కెటింగ్ వెబ్‌సైట్‌లో పెట్టి.. కారు చవగ్గా అమ్మేశాడు. శామ్ సంగ్ టీవీని ఒక పౌండు.. అంటే సుమారు వంద రూపాయల చొప్పున అమ్మాడు. కంప్యూటర్ ఏడు పౌండ్లు.. అంటే సుమారు రూ. 700 అన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement