German man
-
ప్రపంచ రికార్డుకు బరువైన సైకిల్..!
-
ప్రపంచ రికార్డుకు బరువైన సైకిల్..!
ద్విచక్ర వాహనాల్లో అతితక్కువ బరువుండేది సైకిలే అని చెప్సాలి. అయితే ఇప్పుడు కొత్తగా రూపొందిన సైకిల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిగిలిన ద్విచక్ర వాహనాలే కాక, కార్లకంటే కూడా బరువుగా ఉండే సైకిల్ ను జర్మనీకి చెందిన ఓ సైకిల్ అభిమాని రూపొందించాడు. వందలకొద్దీ బరువున్న ప్రపంచంలోనే అత్యంత బరువైన ఆ సైకిల్ ఇప్పుడు రికార్డులకు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది. జర్మనీ స్లెస్వింగ్ హోల్ స్టెన్ కు చెందిన 49 ఏళ్ళ ఫ్రాంక్ డోస్.. భారీ వాహనాల టైర్లు, పాత ఇనుప సామాన్లతో అత్యంత బరువైన సైకిల్ ను రూపొందించాడు. ఈ జంబో సైకిల్ 1.53 మీటర్ల వ్యాసం, 940 కిలోల బరువు కలిగి ఉంది. ఈ సైకిల్ ను 1200 కేజీల మరింత బరువుగా రూపొందించే పనిలో కూడా ఉన్నట్లు డోస్ చెప్తున్నాడు. అయితే అంతటి బరువున్న ఆ సైకిల్ ను సాధారణ సైకిల్ తొక్కినట్లుగానే సునాయాసంగా తొక్కొచ్చని డోస్ చెప్తున్నాడు. ఈ భారీ సైకిల్ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఈ సైకిల్ ప్రయాణిస్తుంది. రెండేళ్ళు కష్టపడి దాదాపు 5000 డాలర్లు ఖర్చు చేసి డోస్... ప్రపంచంలోకెల్లా అత్యంత బరువైన సైకిల్ ను రూపొందించాడు. ఇటీవల 100 మీటర్ల దూరం తొక్కి చూపించిన డోస్.. గిన్నిస్ రికార్డుకోసం ప్రయత్నిస్తున్నాడు. గతంలో బెల్జియం కు చెందిన జెఫ్ పీటర్స్ తయారు చేసిన 860 కిలోల బరువైన సైకిల్ గిన్నిస్ రికార్డు పొందగా... అంతకు మించిన 940 కిలోల బరువుతో డోస్ తయారు చేసిన సైకిల్.. ఇప్పుడు ప్రపంచ రికార్డును సాధించనుంది. -
నాగుండె పగిలి..రెండు ముక్కలైంది
-
నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది..
బెర్లిన్ : నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది అంటూ ఓ బాయ్‌ఫ్రెండ్...మాజీ భార్యపై వెరైటీగా తన అక్కసు తీర్చుకున్నాడు. జర్మనీకి చెందిన ఓ యువకుడు .. లారా అనే మాజీ భార్యపై కోపంతో ... గతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నింటినీ సగానికి కోసేశాడు. తన గుండె ఒక్కటి మాత్రమే కాదు.. సమస్తం విరిగిపోయింది అని తన మాజీ భార్యకు చెప్పాలనుకున్నాడో ఏమో. తాము ప్రయాణించిన కారు దగ్గర నుంచి... కూర్చునే కుర్చీ వరకూ అతగాడు ఏదీ వదలలేదు. టీవీ, సీడీలు, లాప్టాప్, సెల్‌ఫోన్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, సోఫా, బెడ్, చివరకు టెడ్డీ బేర్ బొమ్మను కూడా సగానికి చక్కగా కోసేసి... మాజీ భార్యకు పంపించాడు. అంతేకాకుండా ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసీ యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడటంతో అయ్యగారు తన వద్ద మిగిలి ఉన్న మిగతా సగ భాగాలను ఈబే మార్కెటింగ్ వెబ్సైట్లో పెట్టి.. కారు చవగ్గా అమ్మేశాడు. శామ్ సంగ్ టీవీని ఒక పౌండు.. అంటే సుమారు వంద రూపాయల చొప్పున అమ్మాడు. కంప్యూటర్ ఏడు పౌండ్లు.. అంటే సుమారు రూ. 700 అన్నమాట.