breaking news
ex-wife
-
విడాకుల సెటిల్మెంట్కు రూ. ఆరు వేల కోట్లు!
సియోల్: ఒకటి కాదు.. రెండు కాదు... వంద కూడా కాదు! దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు! ఇదీ దక్షిణ కొరియాకు చెందిన చెయ్–టే–వోన్ తన మాజీ భార్యకు చెల్లించాల్సిన సెటిల్మెంట్ మొత్తం! ఈ మేరకు సియో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి... దక్షిణ కొరియాకు చెందిన భారీ టెక్ కంపెనీ ఎస్కే గ్రూపు ఛైర్మన్ ఛేయ్–టే–వోన్. దేశ మాజీ ప్రధాని రో–టే–వూ కూతురు రో–సో–యాంగ్‌ను 1988లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా. అయితే తనకు ఇంకో మహిళతో సంబంధం ఉందని, బిడ్డ కూడా పుట్టిందని తెలిపిన ఛేయ్ 2017లో విడాకుల కోసం కోర్టుకెక్కాడు. విచారణ తరువాత హైకోర్టు గత ఏడాది తీర్పునిస్తూ రో–సో–యాంగ్‌కు సెటిల్మెంట్ కింద 130 కోట్ల వాన్లు (రూ.8563 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. భరణం కింద చెల్లించాల్సిన 200 కోట్ల వోన్లు దీనికి అదనం. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరడంతో మరోసారి విచారణ జరిగింది. ఛేయ్ చెల్లించాల్సిన సెటిల్మెంట్ మొత్తం సుమారు ఆరువేల కోట్ల రూపాయలకు తగ్గింది. రో–సో–యాంగ్ తండ్రి ప్రధానిగా ఉండగా ఎస్కే గ్రూపుకు సుమారు 3000 కోట్ల వాన్లు అక్రమంగా చెల్లించాడని హైకోర్టు గుర్తించింది. అయితే ఆ మొత్తాన్ని కంపెనీ వృద్ధికి చట్టబద్ధంగా చెల్లించిన మొత్తంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతేనేం... ఛేయ్ – రో–సో–యాంగ్ల విడాకుల సెటిల్మెంట్ మొత్తం ఓ రికార్డు సృష్టించింది. ఈ ఏటి మేటిగా దక్షిణ కొరియా మీడియా వర్ణిస్తోంది! -
మాజీ భార్యతోపాటు ఆరుగురి కాల్చివేత
ఆర్కాబుతాలా(యూఎస్): అమెరికాలో మరో ఘోరం జరిగిపోయింది. ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన మాజీ భార్య, సవతి తండ్రితో పాటు మరో నలుగురిని కాల్చి చంపాడు. ఉత్తర మిసిసిపీలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. రిచర్డ్ డేల్ క్రమ్(52) తొలుత టెన్నెసీ స్టేట్ లైన్ సమీపంలోని ఆర్కాబుతాలా దుకాణంలో బయట ఓ వాహనంలో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని హ్యాండ్‌గన్‌తో కాల్చేశాడు. తర్వాత కొద్ది మైళ్ల దూరంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి, అక్కడున్న మాజీ భార్య, ఆమె భర్తపై తూటాల వర్షం కురిపించాడు. మాజీ భార్య మరణించగా భర్త గాయాల పాలయ్యాడు. అనంతరం మరో తన సవతి తండ్రి ఇంట్లోకి దూరి ఆయన్ను, ఆయన సోదరిని అంతం చేశాడు. తర్వాత తాపీగా నడుచుకుంటూ తన ఇంటి వెనుకకు చేరుకున్నాడు. రోడ్డుపై కనిపించిన ఓ వ్యక్తిపై, వాహనంలో కూర్చున్న మరొకరిని కాల్చి చంపాడు. పోలీసులు రంగంలోకి దిగి క్రమ్‌ను అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కాల్పుల్లో ఆరుగురు మరణించడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తుపాకీ చట్టాలను సంస్కరించడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌కు జో బైడెన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. -
మాజీ భార్య ఇంటి చుట్టూ బాంబులు!
-
నాగుండె పగిలి..రెండు ముక్కలైంది
-
నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది..
బెర్లిన్ : నా గుండె పగిలింది...రెండు ముక్కలయింది అంటూ ఓ బాయ్‌ఫ్రెండ్...మాజీ భార్యపై వెరైటీగా తన అక్కసు తీర్చుకున్నాడు. జర్మనీకి చెందిన ఓ యువకుడు .. లారా అనే మాజీ భార్యపై కోపంతో ... గతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నింటినీ సగానికి కోసేశాడు. తన గుండె ఒక్కటి మాత్రమే కాదు.. సమస్తం విరిగిపోయింది అని తన మాజీ భార్యకు చెప్పాలనుకున్నాడో ఏమో. తాము ప్రయాణించిన కారు దగ్గర నుంచి... కూర్చునే కుర్చీ వరకూ అతగాడు ఏదీ వదలలేదు. టీవీ, సీడీలు, లాప్టాప్, సెల్‌ఫోన్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, సోఫా, బెడ్, చివరకు టెడ్డీ బేర్ బొమ్మను కూడా సగానికి చక్కగా కోసేసి... మాజీ భార్యకు పంపించాడు. అంతేకాకుండా ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసీ యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడటంతో అయ్యగారు తన వద్ద మిగిలి ఉన్న మిగతా సగ భాగాలను ఈబే మార్కెటింగ్ వెబ్సైట్లో పెట్టి.. కారు చవగ్గా అమ్మేశాడు. శామ్ సంగ్ టీవీని ఒక పౌండు.. అంటే సుమారు వంద రూపాయల చొప్పున అమ్మాడు. కంప్యూటర్ ఏడు పౌండ్లు.. అంటే సుమారు రూ. 700 అన్నమాట.


