ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత

Formula One World Champion Niki Lauda Dies - Sakshi

వియన్నా: ఆస్ట్రియా ఫార్ములా వన్‌ దిగ్గజం నికీ లాడా (70) కన్నుమూశారు. గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ ఎఫ్‌-1 రేసర్‌గా పేరు సొంతం చేసుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. 1949లో ఆస్ట్రియాలో జన్మించిన నిక్కీ.. ఫార్మాల్‌ వన్‌ రేసులో అత్యుత్తమ స్థాయి వరకు ఎదిగారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top