వీసాల మోసం కేసు.. ఐదుగురు భారతీయుల అరెస్టు | for visa fraud five Indians peoples are arrested | Sakshi
Sakshi News home page

వీసాల మోసం కేసు.. ఐదుగురు భారతీయుల అరెస్టు

May 31 2014 2:18 AM | Updated on Aug 20 2018 4:44 PM

అమెరికాలో భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలు, ఆర్థిక సాయం విషయంలో మోసానికి పాల్పడిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు.

 న్యూయార్క్: అమెరికాలో భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలు, ఆర్థిక సాయం విషయంలో మోసానికి పాల్పడిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సురేశ్ హీరానందనే(60), ఆయన కుమారుడు సమీర్ హీరానందనే(27), సోదరి అనితా చాబ్రియా(49), బావమరిది లలిత్‌చాబ్రియా(54), ఉద్యోగి సీమా షా(41) ఉన్నారు. వీరిని గురువారం మన్‌హటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. అభియోగాలు రుజువైతే 5-20 ఏళ్ల శిక్ష పడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement