ఆఫ్ఘాన్లో పేలుడు: ఐదుగురు మృతి | Five killed in Afghan blast | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘాన్లో పేలుడు: ఐదుగురు మృతి

Apr 5 2015 8:45 AM | Updated on Apr 4 2019 5:24 PM

ఉత్తర ఆఫ్ఘానిస్థాన్ ప్రావెన్స్లోని బాగ్లన్లో శనివారం బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు.

కాబూల్: ఉత్తర ఆఫ్ఘానిస్థాన్ ప్రావెన్స్లోని బాగ్లన్లో శనివారం బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. రహదారి సమీపంలో  మోటర్ సైకిల్లో ఉంచిన బాంబు... ఆర్మీ వాహనం సమీపిస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ ఘటనలో మరణించారని చెప్పారు. తాలిబాన్ సంస్థకు చెందిన తీవ్రవాదులే ఈ పేలుడుకు పాల్పడ్డారని వెల్లడించారు. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. గతేడాది  ఆఫ్ఘానిస్థాన్ లో  తాలిబాన్ దాడిలో 3700 మంది పౌరులు మరణించగా, 6800 మంది పౌరులు గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement