ఆస్ట్రేలియాలో 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన తుపాకుల సంస్కరణలు, ఆయుధాల ఉపసంహరణ కార్యక్రమం తరువాత ఉద్దేశపూర్వక దాడులు, మారణ కాండలు గణనీయంగా తగ్గినట్లు సిడ్నీ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది.
20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాల్పులు, దాడుల తగ్గుదల
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన తుపాకుల సంస్కరణలు, ఆయుధాల ఉపసంహరణ కార్యక్రమం తరువాత ఉద్దేశపూర్వక దాడులు, మారణ కాండలు గణనీయంగా తగ్గినట్లు సిడ్నీ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. సంస్కరణలకు ముందు 18 ఏళ్లలో అక్కడ 13 భీకర సామూహిక కాల్పులు జరిగాయి. 1996లో టాస్మానియాలో ఓ వ్యక్తి రెండు రైఫిళ్లతో 35 మందిని కాల్చి చంపి, 19 మందిని గాయపరిచాడు. తదుపరి ఆస్ట్రేలియాలో విప్లవాత్మక మార్పులు చేపట్టారని పరిశోధకులు తెలిపారు.
అదే సంవత్సరం జూన్‌లో రాపిడ్ లాంగ్ తుపాకులు, ప్రైవేటు వ్యక్తుల వద్దనున్న ఆయుధాలను నిషేధిస్తూ ఫెడరల్ ప్రభుత్వం చట్టం చేసింది. 1997 జనవరి1 నుంచి ఫెడరల్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ధరకే నిషేధిత ఆయుధాల తిరిగి కొనుగోలును ప్రారంభించాయని అధ్యయనకర్తలు వెల్లడించారు. ఈ 20 ఏళ్లలో సుమారు 10 లక్షల నిషేధిత ఆయుధాలను ప్రజలు స్వచ్ఛందంగా వదులుకున్నారు.