మాయంకానున్న ఫేస్బుక్! | Facebook pokes fun at study saying it will lose 80 percent users | Sakshi
Sakshi News home page

మాయంకానున్న ఫేస్బుక్!

Jan 24 2014 6:18 PM | Updated on Jul 26 2018 5:21 PM

మాయంకానున్న ఫేస్బుక్! - Sakshi

మాయంకానున్న ఫేస్బుక్!

నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్ కనుమరుగుకానుందా?

వాషింగ్టన్: నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్ కనుమరుగుకానుందా? మరెంతోకాలం మనుగడ సాగించలేదా? అంటే అమెరికాలో ఓ సర్వే అవుననే చెబుతోంది.

2015-2017 నాటికి ఫేస్బుక్ 80 శాతం మంది తన ఖాతాదారుల్ని కోల్పోతుందని ప్రిన్స్టన్ యూనివర్సిటీ విద్యార్థుల జరిపిన సర్వేలో  వెల్లడైంది.  పేస్ బుక్ వాడకం దారుల సంఖ్య రానురాను అదే రీతిలో పతనమవుతుందని ఆ సర్వే పేర్కింది. ఫేస్ బుక్ మరెంతో కాలం మనుగడ సాగించలేదని, క్రమేణా వాడకం దారులు పూర్తిగా తగ్గి కనుమరుగవుతుందని వెల్లడించింది. దీనికి పలు ఉదాహరణలను, కారణాలను తెలియజేసింది. ఫేస్బుక్లో ప్రస్తుతం 119 కోట్లమంది ఖాతాదారులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement