మార్జాలానికి మహా ఫాలోయింగ్ | Eye condition gives cat 'alien' cat Matilda her appearance | Sakshi
Sakshi News home page

మార్జాలానికి మహా ఫాలోయింగ్

Jun 20 2015 1:42 AM | Updated on Sep 3 2017 4:01 AM

మార్జాలానికి మహా ఫాలోయింగ్

మార్జాలానికి మహా ఫాలోయింగ్

ఎక్కడైనా సెలబ్రిటీలు, సినిమా నటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

ఎక్కడైనా సెలబ్రిటీలు, సినిమా నటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరి ఓ పిల్లికి 33 వేల మంది ఫాలోయర్లు ఉన్నారంటే నమ్మగలమా..! అయినా నమ్మక తప్పదు మరి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసిన దీని చిత్రాలను చూసి ఇటువంటి వారి సంఖ్య రాకెట్‌లా పైకిపోతోందట. ఈ పిల్లి పేరు శాడ్లీ మటిల్డా. దీనికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం పెద్ద సైజులో ఉన్న అద్దాల వంటి కళ్లేనట. పుట్టిన సరి గ్గా ఏడాది తర్వాత దీని కుడికన్ను ఒక్కసారిగా పెద్దదిగా మారిపోయింది.

దీంతో శాడ్లీని దాని యజమానులు వైద్యుడి వద్దకు తీసుకుపోయి పరీక్షలు చేయిం చగా ఫెలైన్ లుకేమియా వ్యాధితో బాధపడుతోందనే విషయం బయటపడింది. వైద్యుల సలహామేరకు మందులు వాడుతుండగానే రెండో కన్నుకూడా పెద్దదిగా మారిపోయింది. క్రమంగా దానికి చూపు మందగించిపోయింది. ఆ తర్వాత  వైద్యుడి సలహా మేరకు ఐ డ్రాప్స్ వాడటంతో పరిస్థితి మెరుగుపడిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement