పెళ్ళి నిశ్చితార్థానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఓ యువతిని పెళ్ళికి ప్రపోజ్ చేసిన యువకుడు ఉంగరం చేయిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే చేయించాడు కూడా. కానీ ఉంగరంలోని డైమండ్ చిన్నదైందంటూ ఏకంగా పెళ్ళికే ససేమిరా అందా మగువ. ఎంగేజ్ మెంట్ రింగ్ లో డైమండ్ చిన్నదైనందుకు పెళ్ళినే నిరాకరించింది. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.
పాపం ఆ ప్రేమికుడు... ప్రేయసిని ఉంగరంతో ఆశ్చర్యపరచాలనుకున్నాడు. పార్టీకి పిలిచి డైమండ్ రింగ్ బహూకరించి పెళ్ళి చేసుకుందామన్న ప్రపోజల్ తో సిద్ధంగా వచ్చాడు. తీరా ఆమె ఉంగరంలో చిన్న డైమండ్ ఉందంటూ పెళ్ళినే నిరాకరించడంతో వందలమంది డ్యాన్సర్లు ముందే మోకరిల్లాడు. ఎంతగానో బతిమలాడాడు. అయితేనేం వజ్రంలాంటి కుర్రాడికన్నా ఉంగరంలోని వజ్రానికే ఆ చిన్నది ప్రాముఖ్యతనిచ్చింది. పెళ్ళి గిళ్ళి జాంతానై.. అంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
నైరుతి చైనా రాజధాని, సుచియాన్ ప్రావిన్స్ నగరంలో ఆమె చేస్తున్న చెంగ్డూ నృత్యాన్ని చూసి ఆ ప్రేమికుడు ఫిదా అయిపోయాడు. ఆమె వెంటపడి తన ప్రేమను తెలిపాడు. అలాగే పెళ్ళికి కూడ ప్రపోజ్ చేశాడు. వజ్రం ఉంగరం ఇస్తామని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే తన బాయ్ ఫ్రెడ్ వజ్రం ఉంగరాన్ని తెచ్చివ్వడాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. బాక్స్ నుంచి ఉంగరం బయటకు తీశాడు. అంతే.. ఆమె ముఖం మాడిపోయింది. ఏంటీ ఇంత చిన్న వజ్రమా అంటూ ఉంగరంతోపాటు అతడి ప్రపోజల్ నూ తిప్పి కొట్టింది. అతడితో మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయింది. జరిగిన తతంగంపై ఆ ప్రియురాలు 'వియ్ ఛాట్' లో తన స్నేహితురాలితో సంభాషించింది. ఆ తర్వాత ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ గా మారి... ఆన్ లైన్ లో లీకయింది. ఓ కథలా పబ్లిష్ అయ్యింది.
తనకు ప్రపోజ్ చేసినప్పుడు వన్ కేరెట్ వజ్రంతో ఉంగరం చేయిస్తానన్నాడని, తీరా నిశ్చితార్థానికి అంత చిన్న వజ్రం ఉంగరం ఇవ్వడంలో అతని ఉద్యేశ్యం ఏమిటంటూ ఆమె తన అభద్రతా భావాన్ని మెసేజ్ లో వ్యక్త పరిచింది. అతడు తనగురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఫ్రెండ్ ''బాధపడకు నీకోసం మరో పెద్ద రింగ్ ఎదురు చూస్తూ ఉండి ఉంటుందిలే'' అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా మెసేజ్ ల ద్వారా విషయం లీక్ అవడంతో ఆ ప్రేమికుల కథ బట్టబయలైంది. సో అబ్బాయిలూ ప్రపోజ్ చేసేంముందు కాస్ల ఆలోచించి మరీ వాగ్దానాలు చేయాలని మర్చిపోకండి.
డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!
Published Wed, Dec 23 2015 1:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement