చైనాలోని వాయవ్య ప్రాంతం షాంఝి ప్రావిన్స్లో దుండగులు ఓ బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు.
బీజింగ్: చైనాలోని వాయవ్య ప్రాంతం షాంఝి ప్రావిన్స్లో దుండగులు ఓ బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిదిమంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
షాంఝి రాజధాని ఝియన్ నగరంలో ఫుజోవ్-యించ్వాన్ హైవేపై ఓ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇంతకు మంచి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇది ఉగ్రవాద చర్యా లేక తిరుగుబాటుదారుల చర్యా అన్న విషయం తెలియరాలేదు.