భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం

Earths Core And Mantle Discovered In Pacific Ocean - Sakshi

మేరిల్యాండ్‌: శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ విశ్వానికి సంబంధించిన పలు రహస్యాలు కనుగొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా భూ అంతర్భాగానికి సంబంధించిన విషయాలు, రహస్యాలను తెలుసుకోవడానికి కూడా నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు పసిఫిక్‌ మహాసముద్రం కింద ఉన్న భూమిలో పరిశోధనలు చేసి భూమి లోపల ఉండే  మంటిల్‌ పొర వద్ద ఓ భారీ నిర్మాణాన్ని కనుగొన్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డోయోన్ కిమ్, అతని సహచరులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత మార్క్వాస్ దీవుల కింద ఉన్న భూమిలో ఓ కొత్త నిర్మాణాన్ని కనుగొన్నట్లు తెలిపారు. (జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్)

వేల కిలోమిటర్ల అడుగున​ భూ అంతర్భంగంలోని ఈ  నిర్మాణాన్ని కనుగొనడానికి భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే తరంగాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడిం‍చారు. ఈ నిర్మాణాన్ని భూమి లోపల 2900 కిలోమీటర్ల వద్ద గుర్తించామని తెలిపారు. అల్ట్రా లో వెలాసిటీ(యూఎల్‌వీ)జోన్‌ అని పిలువబడే ఈ నిర్మాణం 1000 కిలోమీటర్ల వ్యాసం, 25 కిలోమీటర్ల మందంతో ఉన్నట్లు కిమ్‌ తెలిపారు. భూకంపకాలు సంభవించినప్పుడు వచ్చే తరంగాలు భూమిలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ తరంగాల ప్రతిధ్వనుల సాయంతో భూమి ఉపరితల భౌతిక లక్షణాలతోపాటు భూగర్భంలోని పలు నిర్మాణాలను కనుగొనవచ్చుని పేర్కొన్నారు. దీనికోసం 1990 నుంచి 2018 వరకు పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంతం చూట్టూ సంభవించిన సుమారు 7000 భూకంపాలకు సంబంధించిన తరంగాల రికార్డులను విశ్లేషించినట్లు డోయోన్‌ కిమ్‌ తెలిపారు.(వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. మల్టీ లాగిన్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top