ఆప్ఘనిస్తాన్లో బుధవారం ఉదయం భూమి కంపించండం కలకలం సృష్టించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం
Jan 13 2016 11:13 AM | Updated on Sep 3 2017 3:37 PM
కాబూల్ : ఆప్ఘనిస్తాన్లో బుధవారం ఉదయం భూమి కంపించండం కలకలం సృష్టించింది. రాజధాని కాబుల్ సహా ఆప్ఘాన్ లోని జుర్మ్, బదాక్షన్ తదితర పలు ప్రాంతాల్లో స్పల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్ర రిక్టర్ స్టేల్ పై 5.6 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో బెంబేలెత్తిన జనం ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు.
5 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందలేదు. మరోవైపు ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా సంభవిస్తున్న భూ ప్రకంపనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతం వారంరోజుల్లో ఇది మూడవ భూకంపం సంభవించడం ఇది మూడో సారి. కాగా గత ఏడాది చివర్లో జరిగిన భూకంపం వల్ల ఆప్ఘాన్ అతలాకుతలమైన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement