ఉ. కొరియాపై సైనిక దాడే మార్గం: అమెరికా | Donald Trump begins 12-day Asia trip, Japan first port of call | Sakshi
Sakshi News home page

ఉ. కొరియాపై సైనిక దాడే మార్గం: అమెరికా

Nov 6 2017 3:38 AM | Updated on Aug 25 2018 7:52 PM

Donald Trump begins 12-day Asia trip, Japan first port of call - Sakshi

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది. అమెరికాతో యుద్ధం తలెత్తితే ఉ.కొరియా జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించే వీలుందని విశ్లేషించింది. ఈ మేరకు పెంటగాన్‌ అమెరికా చట్ట సభ్యులకు రాసిన లేఖలో...ఉ.కొరియాను ఎదుర్కొని, వారి అణ్వాయుధాలను ధ్వంసం చేయడానికి అమెరికాకున్న సామర్థ్యాలపై చర్చలు జరపడం గోప్యంగా ఉంచాల్సిన విషయమని అభిప్రాయపడింది.  

అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్‌
ఏ నియంత కూడా అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఆసియా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జపాన్‌ చేరుకున్నారు. టోక్యోలోని యొకోటా ఎయిర్‌ బేస్‌లో మాట్లాడుతూ...‘ఏ నియంత, ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా అమెరికా దృఢ సంకల్పాన్ని తక్కువగా చూడొద్దు’ అని అన్నారు. మరోవైపు, జపాన్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌.. జపాన్‌ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement