పిలవని పెళ్లికి వెళ్లిన ట్రంప్‌ | Donald Trump Attended To Wedding At Trump Golf Course | Sakshi
Sakshi News home page

పిలవని పెళ్లికి వెళ్లిన ట్రంప్‌

Jul 4 2018 8:26 PM | Updated on Aug 25 2018 7:52 PM

Donald Trump Attended To Wedding At Trump Golf Course - Sakshi

న్యూజెర్సీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలవని పేరంటానికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. సాధారణంగా భద్రత లేకుండా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లరు. అలాంటిది న్యూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన ఈ పెళ్లికి ఏకంగా ప్రెసిడెంట్‌ హాజరుకావడంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఈ సందర్భంగా వధూవరులకు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు.

కాగా, ట్రంప్‌ ఇప్పటికి పలుమార్లు పెళ్లిళ్లకు ఇలానే ముందస్తు సమాచారం లేకుండా హాజరై ఆశ్చర్యపర్చారు. తాజాగా మరైన్ వన్ చాపర్‌లో పెళ్లి వేదిక వద్దకు ట్రంప్‌ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement