కరోనా బారి నుంచి ఇలా తప్పించుకోండి!

Doctor Sandhya Ramanathan Video On Corona Virus - Sakshi

వెల్లింగ్టన్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా వైరస్‌ సోకని ప్రాంతం లేదు. కొంతమందిలో లక్షణాలు కనిపిస్తుంటే మరికొంత మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అవుతుంది. చాలా మందికి తమకి కరోనా వైరస్‌ సోకిందేమో అనే అనుమానం కలుగుతోంది. కానీ ప్రస్తుతం వస్తున్న రద్దీ లేదా ఇతర కారణాల వల్ల కావొచ్చు, ఆసుపత్రులకు వెళ్లి ఎలా పరీక్షలు‌ చేయించుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం న్యూజీల్యాండ్‌లోని ఆక్‌ల్యాండ్‌కు చెందిన జనరల్‌ ప్రాక్టీషనర్‌ డాక్టర్ సంధ్యా రామనాథన్ మంచి చిట్కాలు,‌ కొన్ని సలహాల ఇచ్చారు. కరోనా సోకిందా లేదా నిర్థారణ కోసం ఉపయోగపడే పరికరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో బహుళ ప్రచారంలోకి వచ్చింది.

మీకు కానీ, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానంగా ఉంటే ఒక చిన్న పరికరంతో తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. ఆ పరికరం పేరు పల్స్‌ ఆక్సీ మీటర్‌. ఈ మిషన్‌లో మన చూపుడు వేలును ఉంచితే మన శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా ఎంత మేరకు ఉందో తెలియజేస్తుంది. చూపుడు వేలుకి ఆక్సీమీటర్‌ పెట్టిన తర్వాత మిషన్‌లో 95 నుంచి 100 మధ్యలో రీడింగ్‌ చూపిస్తే ఈ రక్తంలో ఆక్సీజన్‌ తగినంతగా ఉన్నట్టు లెక్క. అంతకంటే తక్కువ చూపిస్తే లేదా 93 కన్నా తక్కువ చూపించిన పక్షంలో వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ రామనాథన్‌ చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా కరోనా వైరస్‌ బారిన పడితే మన శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా రేటు తగ్గుతుంది. అందుకే పల్స్‌ ఆక్సీ మీటర్‌తో పరీక్షించినప్పుడు రేటింగ్‌ తక్కువ వస్తే వైద్యులను సంప్రదించాలి. (వైరస్ సోకకుండా పుతిన్కు భారీ టన్నెల్)

మరో విధంగా కూడా మన కరోనా వైరస్‌ సోకిందనే విషయాన్ని నిర్థారణ చేసుకోవచ్చు. దీని కోసం మీకు కావల్సింది రెండు పెద్ద బెలూన్లు. వీటిలోకి గాలి ఊదటం ద్వారా మీరు ఎంతవరకు శ్వాసను ఎంత వరకు ఆపగలుగుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ సోకితే మనం శ్వాసను ఎక్కువసేపు పట్టి ఉంచలేం. ఇకపోతే, కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరం. దాని కోసం ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను తీసుకోవాలి. ప్రతి రోజు తినే ఆహారంలో జింక్‌, విటమిన్‌ డి, విటమిన్‌ సి తప్పని సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. బయటకు వెళ్లినపుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరిస్తూ, తరచూ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంచుకోవాలి.   (మనం కరోనా వైరస్ను తిప్పికొట్టగలం)

ఇక కరోనా వైరస్‌ సోకిన వారు దాని నుంచి కోలుకోవాలంటే తరుచూ వేడి నీటితో పుక్కిళ్లించి ఉమ్ముతూ ఉండాలి. అదే విధంగా నాజిల్‌ స్స్ర్పేని ఉపయోగించాలి. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల గోడలో చివరి భాగన అతుక్కొని ఉంటుంది. దానిని బయటకు తీసుకురావడానికి శ్వాసకు  సంబంధించిన వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్‌ సోకినా తొందరగా దాని నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలి అనేది డాక్టర్‌ సంధ్య రామ్‌నాథన్‌  వీడియోలో చూపించారు. పైన చెప్పినవన్నీ చేయడం ద్వారా కరోనావైరస్‌ సోకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ( పరికరంతో కరోనా వైరస్.. మటాష్)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top