అత్యాచారం కేసులో డాక్టరే దోషి | doctor found guilty of rape in Australia | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో డాక్టరే దోషి

Sep 17 2013 4:45 PM | Updated on Sep 1 2017 10:48 PM

చికిత్స చేయించుకోడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన సంఘటనలో మను మైంబిల్లీ గోపాల్ అనే భారత సంతతి వైద్యుడిని ఆస్ట్రేలియా కోర్టు దోషీగా నిర్ధారించింది.

చికిత్స చేయించుకోడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన సంఘటనలో మను మైంబిల్లీ గోపాల్ అనే  భారత సంతతి వైద్యుడిని ఆస్ట్రేలియా కోర్టు దోషీగా నిర్ధారించింది. తానెలాంటి తప్పూ చేయలేదని తప్పించుకోవాలని చూసినా కోర్టు ఆయన వాదనల్ని నమ్మలేదు. గోపాల్ను రిమాండ్కు పంపి, తీర్పును ఈ నెల 26కు వాయిదా వేసింది. కేరళలోని కొచ్చికి చెందిన గోపాల్ ఆస్ట్రేలియాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సన్బరీ క్లినిక్కు కడుపునొప్పితో వచ్చిన ఇద్దరు మహిళలపై ఆయన అత్యాచారం చేశారని కేసు నమోదైంది. మార్చి ఒకటో తేదీన భారత్ వెళ్లే విమానం ఎక్కేందుకు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి చూస్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోడానికే గోపాల్ ఆ ఇద్దరు మహిళలకు వైద్య పరీక్షలు చేయాలనుకున్నట్లు ప్రాసిక్యూటర్ లెస్లీ టేలర్ కోర్టులో వాదించారు. నలుగురు బిడ్డల తల్లి అయిన రెండో బాధితురాలిని పరీక్ష చేసే సమయంలో డాక్టర్ గోపాల్ చాలా అసభ్యంగా మాట్లాడారని, అది సరికాదని టేలర్ చెప్పారు. కాగా గోపాల్ భార్యా బిడ్డలు భారతదేశంలో ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement