బీజింగ్‌లో మళ్లీ కరోనా కాటు

COVID-19: New corona virus cases raise fears in Beijing - Sakshi

3 రోజుల్లో 46 మందికి వైరస్‌ 

చైనాలో 83,075కు చేరిన పాజిటివ్‌ కేసులు

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లో మళ్లీ కరోనా గుబులు మొదలైంది. మూడు రోజుల్లో 46 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు నియంత్రణ చర్యల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా కేసులు ప్రబలుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నగరంలోని ఆరు మార్కెట్లను శనివారం మూసివేశారు. ఓ మార్కెట్‌లో సాల్మన్‌ చేపలను కోసే చెక్కమీద కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో నగరంలో పలుచోట్ల చేపల విక్రయాలను నిలిపివేశారు. బీజింగ్‌లో తాజాగా 46 మందికి కరోనా సోకిందని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఈ 46 మంది స్థానిక మార్కెట్‌కి వెళ్లారని, వీరిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. 

రెండు నెలలుగా సురక్షితంగా ఉన్న బీజింగ్‌లో కొత్తగా కోవిడ్‌ కేసులు బయటపడటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా ఆనవాళ్లు గుర్తించిన మార్కెట్‌కి దగ్గర్లో ఉన్న 11 నివాస సముదాయాలను లాక్‌డౌన్‌ చేశారు. మూడు పాఠశాలలు, కిండర్‌గార్టెన్‌లలో తరగతులను రద్దు చేశారు. మే 30 వ తేదీ నుంచి ఈ మార్కెట్‌ని సందర్శించిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం బీజింగ్‌లోని 98 న్యూక్లియిక్‌ యాసిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాల్లో రోజుకి 90,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నగర ఆరోగ్య కమిషన్‌ అధికార ప్రతినిధి గువా షియాజన్‌ చెప్పారు. లక్షణాలు కనిపించకున్నా కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 74 మందితో సహా చైనాలో ఇప్పటి వరకు 83,075 మందికి కరోనా సోకింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2021
May 17, 2021, 09:27 IST
హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా...
17-05-2021
May 17, 2021, 09:13 IST
నల్లగొండటౌన్‌ : కరోనా వైరస్‌ మరింత శక్తివంతంగా మారుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల...
17-05-2021
May 17, 2021, 08:43 IST
గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం...
17-05-2021
May 17, 2021, 08:00 IST
ఆ సంఖ్య మారలేదు. అలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పుచేర్పుల్లేవు. ఏదో ఒక్కరోజు మాత్రమే  తెలపాలనుకున్నప్పుడు  వెబ్‌సైట్‌లో ఎందుకు ..?...
17-05-2021
May 17, 2021, 06:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే...
17-05-2021
May 17, 2021, 06:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం...
17-05-2021
May 17, 2021, 05:37 IST
అమలాపురం టౌన్‌: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు...
17-05-2021
May 17, 2021, 04:40 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌...
17-05-2021
May 17, 2021, 04:34 IST
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ ఆవరణలోని కాంకర్‌...
17-05-2021
May 17, 2021, 04:29 IST
మచిలీపట్నం:  కోవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా,...
17-05-2021
May 17, 2021, 04:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా నియంత్రణ కోసం 2,229 కోట్ల పైచిలుకు వ్యయమైంది....
17-05-2021
May 17, 2021, 04:12 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు కాంగ్రెస్‌ అభయ‘హస్తం’అందించనుంది. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు అండగా ఉండాలని...
17-05-2021
May 17, 2021, 04:01 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరికలకు నిర్వహించాల్సిన  ప్రవేశ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయా? లేదా?...
17-05-2021
May 17, 2021, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.....
17-05-2021
May 17, 2021, 03:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు మీదికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని పోలీసులు ఆపగా ‘మా పక్క వీధిలో అంకుల్‌కు కరోనా...
17-05-2021
May 17, 2021, 02:34 IST
న్యూఢిల్లీ: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ సోమవారం విడుదల కానుంది. నోటి ద్వారా తీసుకునే...
17-05-2021
May 17, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను పంపిణీ...
17-05-2021
May 17, 2021, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంలో పడింది. శని, ఆదివారాల్లో టీకాల పంపిణీని నిలిపివేస్తున్నామని.. తిరిగి సోమవారం...
17-05-2021
May 17, 2021, 00:47 IST
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న...
17-05-2021
May 17, 2021, 00:29 IST
గత నెల 5వ తేదీ మొదలుకొని రోజూ సగటున లక్షకుపైగా కేసులు నమోదవడంతో మొదలై గత పది రోజుల్లో దాదాపు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top