
రంగులు మార్చే హైటెక్ పెన్
నోట్స్ రాసేటప్పుడు కానీ పెయింటింగ్ వేసేటప్పుడు గానీ వేర్వేరు రంగుల కోసం పదే పదే పెన్నులను మార్చాల్సి....
న్యూయార్క్: నోట్స్ రాసేటప్పుడు కానీ పెయింటింగ్ వేసేటప్పుడు గానీ వేర్వేరు రంగుల కోసం పదే పదే పెన్నులను మార్చాల్సి వస్తుంది. పెయింటింగ్ వేసేటప్పుడైతే సరిగ్గా సరిపోయే రంగు ఉన్న పెన్ను ఒక్కోసారి మనకు దొరకదు కూడా. ఇక బ్రష్‌తో వేసేవారికైతే కలర్ మిక్సింగ్ ఓ పెద్ద సమస్య. ఇలాంటప్పుడే ఎంతో చిరాకు వస్తుంది కూడా. దీంతో ఇటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు వస్తోంది హైటెక్ పెన్. మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మన ముందుకొచ్చేసింది.
ఈ పెన్‌ను ప్రకృతిలో కనిపించే పండ్లు, పూలు, ఆకులు ఇలా ఏ వస్తువు ముందు ఉంచినా క్షణాల్లో ఆ వస్తువు తాలూకు రంగును స్కానింగ్ చేసుకొని, ఆ రంగులోకి మారిపోతుంది. ఈ ఒక్క పెన్ను మీ దగ్గరుంటే ఇక మీరు రంగులను మిక్సింగ్ చేసుకోకుండానే అద్భుతమైన చిత్రాలను గీయవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ ఇది. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చేసిన ఈ పెన్ను పెయింటింగ్‌లో అద్భుతాలను సృష్టిస్తుందని చెబుతున్నారు.