మరోసారి నల్లజాతీయులపై పోలీసుల కాల్పులు | clashes between police and black people | Sakshi
Sakshi News home page

మరోసారి నల్లజాతీయులపై పోలీసుల కాల్పులు

Aug 10 2015 12:56 PM | Updated on Oct 2 2018 2:30 PM

మరోసారి అమెరికాలో జాతి వివాదం తలెత్తింది. ముస్సోరి పోలీసులకు నల్లజాతీయులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫలితంగా పలు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి.

అమెరికా: మరోసారి అమెరికాలో జాతి వివాదం తలెత్తింది. ముస్సోరి పోలీసులకు నల్లజాతీయులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫలితంగా పలు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరు గాయాలపాలయ్యారు. మొత్తం 20 సార్లకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు.

గత ఏడాది నల్లజాతీయుడు మైకెల్ బ్రౌన్ ను ఎలాంటి కారణం లేకుండా పోలీసు అధికారి డారెన్ విల్సన్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వేగంగా స్పందించకపోగా డారెన్ విల్సన్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. దీంతో భారీ ఆందోళనకు నల్ల జాతీయులు దిగారు. వీరిని నిలువరించే క్రమంలో పోలీసులు 20 రౌండ్లకాల్పులు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement