breaking news
missorie
-
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్‌హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్‌తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
స్కైడైవింగ్ యాత్ర విషాదాంతం.. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
మిస్సోరీ: అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 11 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ సహా మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కైడైవింగ్ కోసం ప్రయాణికులను తీసుకెళ్తున్న పసిఫిక్ ఎయిరోస్పేస్ పీ-750ఎల్(Pacific Aerospace P750XL) సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సమస్యలను ఎదుర్కొంది. విమానం అవసరమైన ఎత్తుకు చేరుకోకముందే అకస్మాత్తుగా ఎడమవైపు తిరిగింది. అనంతరం రన్‌వేకు సుమారు 300 గజాల దూరంలో నేలపై కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. విమానాన్ని నిర్వహిస్తున్న Skydive Kansas City సంస్థ ఒక ప్రకటనలో ప్రమాదంలో ఉన్న 12 మంది మరణించినట్లు ధృవీకరించింది. మృతుల్లో 11 మంది స్కైడైవర్లు కాగా, మరో వ్యక్తి పైలట్ అని వెల్లడించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే మృతుల పేర్లను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదాన్ని పలువురు కుటుంబ సభ్యులు తమ కళ్లముందే చూసినట్లు బేట్స్ కౌంటీ షెరీఫ్ చాడ్ ఆండర్సన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.🚨😭 12 killed in plane crash near Butler, Missouri. A skydiving plane went down shortly after takeoff from Butler Memorial Airport this morning, with all 11 skydivers and the pilot perishing in the crash.Our deepest condolences go out to all the families and loved ones… pic.twitter.com/mU8EdLrmrZ— The Watchdog (@TheWatchdoggs) June 14, 2026బేట్స్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ డెన్నిస్ జాకబ్స్ ప్రాథమిక అంచనా ప్రకారం.. పైలట్ సమీపంలోని రహదారిపై అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించి ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, అధికారిక కారణం ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో విమానం ఇంకా తక్కువ ఎత్తులోనే ఉండటంతో స్కైడైవర్లలో ఎవరూ దూకే అవకాశం పొందలేదని అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో పూర్తిగా పరిశీలించినప్పటికీ ఎలాంటి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు కనిపించలేదని తెలిపారు.ఈ ఘటనపై ఏవిషేయన్ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. విమానం నిర్వహణ చరిత్ర, సాంకేతిక పరిస్థితి, పైలట్ వివరాలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించే తుది నివేదిక రావడానికి 12 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్టీఎస్బీ పేర్కొంది. ఈ ఘటనతో మిస్సోరీ రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్కైడైవింగ్ కోసం ఉత్సాహంగా బయలుదేరిన 12 మంది జీవితాలు క్షణాల్లో ముగియడంతో స్థానిక సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది. -
సెయింట్ లూయిస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్
మిస్సోరీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆధ్వర్యంలో మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో నవంబర్ 23న వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో అక్కడి స్థానిక తెలుగు ఆటగాళ్లంతా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 20 టీంలుగా పాల్గొన్న తెలుగు వాలీబాల్ ఆటగాళ్లు.. ఈ టోర్నిలో తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. నాట్స్ ప్రతినిధులు ఈ 20 టీంలను పది టీంల చొప్పున రెండు గ్రూపులుగా విభజించి వాటికి ‘పూల్-ఏ’, ‘పూల్-బీ’ అని పేరు పెట్టి టోర్నమెంట్‌ను నిర్వహించారు. ‘పూల్-ఏ’ లోని ‘వీబీ అడిక్ట్స్’ టీం అద్భుతంగా రాణించి విజేతగా నిలవగా, ‘రౌడీస్’ టీం రన్నరప్‌గా నిలిచింది. అలాగే ‘పూల్-బీ’లోని ‘కూల్ డూడ్స్’ టీం విన్నర్‌గా నిలవగా, ‘ధ్వని’ టీం రన్నరప్ ట్రోఫీని దక్కించుకుంది. మొత్తం 200 మందికి పైగా వాలీబాల్ ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు అక్కడి స్థానిక తెలుగు వారంతా తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు. నాట్స్ బోర్డు ఆఫ్ డ్రైరెక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేష్ బెల్లం, నాట్స్ లూయిస్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ నాగ శిష్టా తదితరులు ఈ టోర్నమెంట్లో పాల్గొని కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా నాట్స్ టోర్నమెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన ఇతర ప్రముఖులు విన్నర్స్, రన్నర్స్ టీంలకు ట్రోఫీలు అందించారు. అలాగే టోర్నిలో అద్భుతంగా రాణించి అత్యత్తమ ఆటను కనబరచిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులను అందించి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ విజయానికి తమవంతు సహాయ సహాకారాలను అందించిన పవన్ దగ్గుమాటి, పవన్ కొల్లలను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు ఇలాంటి మరెన్నో టోర్నమెంటులను నిర్వహిస్తామనిక నాట్స్ సంస్థ తెలిపింది. అలాగే ఈ టోర్నమెంటు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. -
గర్భవతికి టాయిలెట్ నీరు తాగించిన ప్రియుడు
వాషింగ్టన్: అమెరికాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భవతి అయిన ప్రియురాలిని టాయిలెట్ నీరు తాగాలంటూ వేధించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తూర్పు మిస్సోరిలో జరిగింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిదితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌కు చెందిన గర్భవతి అయిన ఓ మహిళ(20)సెయింట్ పిటర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుంది. కాగా ఈ క్రమంలో ఆమె ప్రియుడు, నిందితుడు రోన్నీవిలియం హొవర్డ్(40) బుధవారం తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు. టాయిలెట్ నీళ్లు, బ్లీచ్ తాగమని బలవంతం చేస్తూ క్రూరంగా హింసించాడు. ఈ క్రమంలో బాధిత మహిళా తనపై జరిగిన దాడి గురించి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే నిందితుడు హోవర్డ్‌పై ఇదివరకే కిడ్నాప్ కేసు, మహిళలను హింసించినట్లుగా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక గర్భవతిని వేధించిన కేసులో అతడికి 3 లక్షల డాలర్ల జరిమానా విధించి జైలుకు తరలించారు. -
మరోసారి నల్లజాతీయులపై పోలీసుల కాల్పులు
అమెరికా: మరోసారి అమెరికాలో జాతి వివాదం తలెత్తింది. ముస్సోరి పోలీసులకు నల్లజాతీయులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫలితంగా పలు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరు గాయాలపాలయ్యారు. మొత్తం 20 సార్లకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు. గత ఏడాది నల్లజాతీయుడు మైకెల్ బ్రౌన్ ను ఎలాంటి కారణం లేకుండా పోలీసు అధికారి డారెన్ విల్సన్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వేగంగా స్పందించకపోగా డారెన్ విల్సన్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. దీంతో భారీ ఆందోళనకు నల్ల జాతీయులు దిగారు. వీరిని నిలువరించే క్రమంలో పోలీసులు 20 రౌండ్లకాల్పులు జరిపారు.


