‘జీన్‌ ఎడిటింగ్‌’ శాస్త్రవేత్తపై చైనా నిషేధం

China orders inquiry into 'world's first gene-edited babies'  - Sakshi

బీజింగ్‌: జన్యువుల్ని ఎడిటింగ్‌ చేసి ఇద్దరు బేబీల్ని సృష్టించిన వివాదాస్పద చైనా శాస్త్రవేత్త నిషేధానికి గురయ్యాడు. ఈ ప్రయోగంపై దేశవిదేశాల నుంచి విమర్శలు తలెత్తడంతో ఆయన ఇకపై ఎలాంటి శాస్త్రీయ పరిశోధన చేయకుండా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఫలదీకరణ చెందిన అండ కణాల నుంచి ఎయిడ్స్‌ నిరోధకత కలిగిన బేబీని సృష్టించాలని హీ జియాన్‌కుయ్‌ పరిశోధన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హెచ్‌ఐవీ వైరస్‌ను శరీరంలోనికి అనుమతించే ప్రొటీన్‌ కారక జన్యువుని నిర్వీర్యం చేసి, ఇద్దరు బేబీలకు ఐవీఎఫ్‌ పద్ధతిలో జీవం పోసినట్లు ఆయన ఇటీవల ప్రకటించడం సంచలనం సృష్టించింది.  మరోవైపు, బుధవారం హాంకాంగ్‌లో జరిగిన ఓ సదస్సులో జియాన్‌కుయ్‌ తన ప్రయోగం పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. హెచ్‌ఐవీ బాధితులకు తాను సాయం చేస్తున్నట్లు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top