భారత్‌-చైనా సరిహద్దులో మెరుగవుతున్న పరిస్థితులు

China-India Boarder Situations Are Improving Said China - Sakshi

బీజింగ్‌: వివాదాస్పదమైన చైనా-ఇండియా సరిహద్దు  పశ్చిమ భాగంలో పరిస్థితి మెరుగుపడుతోందని చైనా గురువారం తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట  భయంకరమైన సంక్షోభం తరువాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని చైనా పేర్కొంది.  ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్  పై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ & కోఆర్డినేషన్ (డబ్ల్యుఎంసీసీ) బీజింగ్,  న్యూ ఢిల్లీతో కొత్తగా మరో రౌండ్ చర్చలు జరుపుతుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. కమాండర్-స్థాయి చర్చలలో చైనా, భారత సరిహద్దు దళాలు గాల్వన్ లోయ, ఇతర ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ గురువారం సాధారణ మంత్రిత్వ శాఖ సమావేశంలో చెప్పారు. (అప్రమత్తత అవసరం)

సరిహద్దు వెంబడి పరిస్థితులు ప్రస్తుతం​ స్థిరంగా ఉన్నాయి. బలగాలను వెనక్కి తీసుకురావడానికి మాలాగే భారత్‌ కూడా ప్రయత్నిస్తుందని, ఈ విషయంలో మాతో కలిసి పనిచేస్తోందని భావిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. దీంతో రెండు నెలలకు పైగా చైనా భారత్‌ మధ్య సరిహద్దులో జరుగుతున్న ఘర్షణలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై 5 వ తేదీన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌  చైనా విదేశాంగ మంత్రితో  సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అప్పటి నుంచి సరిహద్దు  పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.  

చదవండి: రంగంలోకి దోవల్‌ : తోక ముడిచిన చైనా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top