ఉత్తర కొరియాపై మండిపడ్డ చైనా | China condemns North Korea for conducting sixth Nuclear Test | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియాపై మండిపడ్డ చైనా

Sep 3 2017 6:02 PM | Updated on Sep 17 2017 6:20 PM

ఉత్తర కొరియాపై మండిపడ్డ చైనా

ఉత్తర కొరియాపై మండిపడ్డ చైనా

అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత, ఒత్తిళ్లు ఎదురవుతున్నా మొండిగా అణుపరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై చైనా మండిపడింది.

బీజింగ్‌: అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత, ఒత్తిళ్లు ఎదురవుతున్నా మొండిగా అణుపరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై చైనా మండిపడింది. తాజాగా  కొరియా చేపట్టిన అణ్వస్త్ర పరీక్షను బీజింగ్‌ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమాజం నుంచి విముఖత ఎదురవుతన్నా ఉత్తర కొరియా మళ్లీ అణు పరీక్ష నిర్వహించడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
 
గతంలో నిర్వహించిన అణు పరీక్షల కంటే ఇది అత్యంత శక్తిమంతమైనది కావడం గమనార్హం. హైడ్రోజన్‌ బాంబ్‌ పరీక్షలు నిర్వహించినట్టు ఆదివారం ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement