'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?' | Charlie Sheen 'caught on film lying about HIV to former lover', saying: 'It none of your business' | Sakshi
Sakshi News home page

'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?'

Mar 31 2016 10:46 AM | Updated on Sep 3 2017 8:57 PM

'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?'

'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?'

ఆమె తన మాజీ ప్రేయసి.. ఒకప్పుడు ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. కొద్దికాలం విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ మాటలు కలిశాయి. గతంలో ఉన్న చనువు మేరకు వారిద్దరు తిరిగి శృంగారంలో పాల్గొన్నారు.

బ్రిటన్: ఆమె తన మాజీ ప్రేయసి.. ఒకప్పుడు ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. కొద్దికాలం విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ మాటలు కలిశాయి. గతంలో ఉన్న చనువు మేరకు వారిద్దరు తిరిగి శృంగారంలో పాల్గొన్నారు. కాకపోతే, ఆ ప్రియుడు ఆమె ముందు నిజం దాచాడు. ఆ నిజమేమిటంటే అతడికి అప్పటికే హెచ్ఐవీ సోకింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ అతడు తాఫీగా తనకు ఎయిడ్స్ ఉందంటూ బహిర్గతం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆ మాజీ ప్రేయసి గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎందుకు ఇంతపనిచేశావ్ అని నిలదీస్తే ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతడే.. చార్లీ షీన్. తొలుత రంగస్థల నటుడిగా ఉన్న ఇతడు అనంతరం పలు అమెరికన్ చిత్రాల్లో నటించి కొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నాడు. కానీ, అతడి విచ్చల విడితనం కారణంగా హెచ్ఐవీ సోకింది. ఆ విషయాన్ని తన మాజీ ప్రేయసికి చెప్పకుండా దాచేశాడు. ఇదే విషయాన్ని అతడిని ఆమె ప్రశ్నిస్తే ఏం చెప్పాడో ఒకసారి చూస్తే..

మాజీ ప్రేయసి: నీకు ఎయిడ్స్ లేదని ఎందుకు చెప్పావ్?
షీన్: అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు
మాజీ ప్రేయసి: కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆ విషయం తెలుసుకోవడం నా హక్కు
షీన్: నువ్వు ఇలాంటివి కోరుకోకూడదు.. అంటూ ఇంకా ఎన్నో కొన్ని చెప్పకూడని మాటలు వారిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement