వైరల్‌: గాల్లోకి ఎగిరి.. నుజ్జు నుజ్జైన కారు | Car Hits Roundabout Goes Airborne Video Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: గాల్లోకి ఎగిరి.. నుజ్జు నుజ్జైన కారు

Apr 20 2020 4:13 PM | Updated on Apr 20 2020 4:36 PM

Car Hits Roundabout Goes Airborne Video Viral - Sakshi

రహదారి జంక్షను ఢీకొట్టడంతో కారు విమానంలా గాల్లోకి ఎగిరిన అరుదైన ఘటన పోలాండ్‌లో చోటుచేసుకుంది. ఖాళీ రోడ్డుపై వెళుతున్న స్విప్ట్‌ కారు జంక్షన్‌ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీ​కోనడంతో అది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా.. 41 ఏళ్ల కారు డ్రైవర్‌ తీవ్ర గాయాలతో భయటపడినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్కడి సీసీ కెమారాల్లో రికార్డైనా ఈ దృశ్యాన్ని పొలాండ్‌ పోలీసులు ఫేస్‌బుక్‌ షేర్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ మిలియన్ల వ్యూస్‌ రాగా..  వందల్లో కామెంట్లు వస్తున్నాయి. కాగా ఈ ఘటనలో  కారు తీవ్రంగా ధ్వంసం కావడంతో కారు నుంచి మంటలు వచ్చాయి. ఆగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అర్పి డ్రైవర్‌ను రక్షిం‍చారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం డైవర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement