రైలు టికెట్‌ కొనలేను బాబోయ్‌! | Can not buy a train ticket | Sakshi
Sakshi News home page

రైలు టికెట్‌ కొనలేను బాబోయ్‌!

Apr 15 2018 2:21 AM | Updated on Apr 15 2018 2:21 AM

Can not buy a train ticket - Sakshi

లండన్‌ నుంచి బ్రిస్టల్‌ నగరం వరకు దూరం 160 కిలోమీటర్లు.. 27 ఏళ్ల టామ్‌ చర్చ్‌ అనే యువకుడు లండన్‌ నుంచి బ్రిస్టల్‌కు వెళ్లాలనుకున్నాడు. అందుకు రైలు టికెట్‌ బుక్‌ చేసుకుందామని ఓ వెబ్‌సైట్‌లో చూశాడట. అంతే ఆ టికెట్‌ ధర చూసి మనోడికి కళ్లు తిరిగినంత పనైందట. ఇంతకీ రైలు టికెట్‌ ధర ఎంతో తెలుసా.. దాదాపు రూ.20 వేలు (311 డాలర్లు). అంతే మనోడికి కోపం.. చిరాకు.. బాధ కలిగాయట.

వెంటనే అంతకన్నా తక్కువ ధరకు ఎలా వెళ్లొచ్చనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. అంతకన్నా తక్కువ ధరలో సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని. వెంటనే ఓ వెబ్‌సైట్‌లో వెతకగా ఓ కారు దొరికింది. దాన్ని కొనుక్కుని ఎంచక్కా తన ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్లాడు. ఇంతకీ ఆ కారు ఎంతకు కొన్నాడో తెలుసా.. రూ.19,000. అంటే రైలు టికెట్‌ కంటే వెయ్యి తక్కువగానే వచ్చింది. పైగా కారు కూడా మిగిలింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement