'అలా చేస్తే చీకట్లోకి దూకడమే' | Cameron: Britain's referendum on EU membership to be June 23 | Sakshi
Sakshi News home page

'అలా చేస్తే చీకట్లోకి దూకడమే'

Feb 21 2016 4:42 PM | Updated on Sep 3 2017 6:07 PM

'అలా చేస్తే చీకట్లోకి దూకడమే'

'అలా చేస్తే చీకట్లోకి దూకడమే'

యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ కలసి ఉండాలా? వద్దా? అంశంపై జూన్ 23న ప్రజాభిప్రాయం నిర్వహిస్తామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు.

లండన్: యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ కలసి ఉండాలా? వద్దా? అంశంపై జూన్ 23న ప్రజాభిప్రాయం నిర్వహిస్తామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు. ఈయూ సంస్కరణల ఒప్పందంపై కేబినెట్‌కు వివరించాక తన నివాసం వెలుపల ఈ వివరాలు వెల్లడించారు.

యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండాలనే కోరుకుంటున్నానని, నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఈయూలో ఉంటేనే దేశం బలంగా, సురక్షితంగా ఉంటుందని తన మనసులో మాట చెప్పారు. వైదొలగడం చీకట్లోకి దూకడమేనంటూ ఇదివరకే కామెరాన్ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement