మిలియనీర్‌ అని చెప్పినా..బయటకు పంపారు | California real estate 'millionaire' who was thrown off a flight | Sakshi
Sakshi News home page

మిలియనీర్‌ అని చెప్పినా..బయటకు పంపారు

Apr 14 2016 12:53 PM | Updated on Oct 2 2018 8:04 PM

మిలియనీర్‌ అని చెప్పినా..బయటకు పంపారు - Sakshi

మిలియనీర్‌ అని చెప్పినా..బయటకు పంపారు

నా వయసు 28ఏళ్లు, ఏడాదికి 4 మిలియన్ డాలర్లు సంపాదిస్తా, నాకు ఆరు సొంత ఇళ్లులున్నాయి..

కాలిఫోర్నియా:
నా వయసు 28ఏళ్లు, ఏడాదికి 4 మిలియన్ డాలర్లు సంపాదిస్తా, నాకు ఆరు సొంత ఇళ్లులున్నాయి.. నువ్వేం చేయగలవు..అంటూ మరో ప్రయాణికుడితో గొడవపడుతూ విమానంలో డబ్బా కొట్టుకున్న ఓ వ్యక్తిని సిబ్బంది బయటకు పంపించేసింది. ఫుల్లుగా మద్యం సేవించి జెట్‌బ్లూ విమానంలో ముగ్గురు వ్యక్తులు గొడవ పడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. అక్కడకు వచ్చిన విమానసిబ్బందితోనూ  మిలియనీర్ అని చెప్పుకున్న వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆఖరికి చేసేదేమీలేక, గట్టిగా అరుస్తూ ప్రయాణికులను ఇబ్బందుకు గురి చేస్తున్న ఆ ముగ్గురిని పోలీసుల సహాయంతో బయటకు పంపించారు.

లాంగ్ బీచ్‌ నుంచి సాక్రమెంటోకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో ప్రయాణికురాలు ఈ మొత్తాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో మిలియనీర్ బాగోతం బయటకు తెలిసింది. అయితే  వీడియోలో మిలియనీర్‌గా చెప్పుకున్న వ్యక్తి డేవిడ్ బ్రాకెట్‌గా తెలుస్తోంది. అతను కాలిఫోర్నియా రియల్ ఎస్టేట్, మోర్టగేజ్ కంపెనీ హోమ్ ల్యాండ్ ఫైనాన్సియల్ నెట్‌వర్క్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement