2 మైళ్లు ప్రయాణించి.. తలలో ఇరుక్కుంది

Bullet Stuck In The Romanian Mans Head - Sakshi

బుకారెస్ట్ :  రొమానియాలోని జార్జ్‌ కౌంటీ. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం.  22ఏళ్ల కాంస్టాటిన్‌ వోచినోయి రోడ్డు పక్కన కారు పార్క్‌ చేసి డోరు మూయబోతున్నాడు. ఇంతలో అతని తలలో ఏదో దిగబడ్డట్టు అనిపించింది. విపరీతమైన నొప్పితో అతడు కూలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని అద్దంలో చూసుకున్నాడు. షాక్‌! ఓ బుల్లెట్‌ అతడి తలలో ఇరుక్కుని ఉంది. పైగా బయటకు బాగా కనిపిస్తోంది. నొప్పి భరించలేక అతడు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాడు.  అయితే అక్కడి వైద్యులు బుల్లెట్‌ బయటకు తీయటం చాలా కష్టమని, అలాచేస్తే ప్రాణానికి ప్రమాదమని చెప్పారు.


తలలో దిగిన బుల్లెట్‌

దీంతో అతడు క్రయోవాలోని ఓ పెద్ద ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అతడికి ఆపరేషన్‌ చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. వోచినోయి ఆ తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బుల్లెట్‌ ఎవరు పేల్చారా అని దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు కారు పార్క్‌ చేసిన ప్రాంతం నుంచి సరిగ్గా రెండు మైళ్ల దూరంలో పోలీసులు ఫైరింగ్‌ నేర్చుకునే ప్రదేశం ఉందని, అక్కడ వాళ్లు పేల్చిన ఓ తుపాకి గుండు రెండు మైళ్లు ప్రయాణించి అతడి తలలో దిగబడిందని పోలీసులు తెలిపారు. అంతదూరం ప్రయాణించటం వల్లే అది తలలోకి దూరకుండా పుర్రెలో ఇరుక్కుపోయిందని వెల్లడించారు.

ఈ సంఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఫైరింగ్‌ ట్రైనింగ్‌లో భాగంగా ఉపయోగించే కొన్ని మిషన్‌ గన్నుల రేంజ్‌ మూడు కిలోమీటర్లు(1.87మైళ్లు) వరకు ఉంటుందని తెలిపారు. ట్రైనింగ్‌ ఉన్న సమయంలో అన్ని రక్షణా చర్యలు తీసుకుంటామని, ఆ ప్రాంతంలో ఎవరూ ఉండకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. అయితే ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్నది తెలియరాలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top