బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర | Britain Prince Harry was the prime target of Taliban | Sakshi
Sakshi News home page

బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర

Oct 5 2013 3:39 PM | Updated on Sep 1 2017 11:22 PM

బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర

బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర

అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ ఉగ్రవాదులు బ్రిటన్ యువరాజు హారీ హత్యకు కుట్రపన్నారు.

అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ ఉగ్రవాదులు బ్రిటన్ యువరాజు హారీ హత్యకు కుట్రపన్నారు. ఆయనను బంధించి చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించారు. అఫ్ఘాన్లో బ్రిటీష్ దళాల తరపున హారీ పనిచేస్తున్నప్పడు ఈ సంఘటనలు జరినట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. తాలిబన్ నాయకుడు ఖ్వారీ నస్రుల్లా ఓ పాకిస్థాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పినట్టు వెల్లడైంది.

'అఫ్ఘాన్కు హారీ వచ్చినపుడు మా సభ్యులు అతన్ని హతమార్చేందుకు ప్రయత్నించారు. అమెరికా కోసం పోరాటం చేస్తున్న ఓ సాధారణ సైనికుడిగానే హారీని పరిగణించాం. ఆయన బ్రిటన్లో యువరాజే అయినా మా దృష్టిలో ఓ సైనికుడు మాత్రమే. హారీని చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాం కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు' అని తాలిబన్ నేత చెప్పాడు. మొదటిసారి 2008-12 మధ్య కాలంలో అఫ్ఘాన్ వెళ్లిన హారీ సైన్యంలో హెలికాప్టర్ పైలట్గా  పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement