కాలుష్యానికి 6 లక్షల చిన్నారుల బలి

Breathing polluted air kills 600000 children under 15 every year - Sakshi

జెనీవా: ఇంటాబయటా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆరోగ్యం–వాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో రూపొందించిన ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టీఏ ఘెబ్రెయ్‌సస్‌ వెల్లడించారు. ఆ వివరాలు. నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో 93 శాతం మంది 180 కోట్ల మంది, వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు కలుషిత గాలిని పీలుస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు గురై 2016లో దాదాపు 6 లక్షల మంది చిన్నారులు చనిపోయారు. ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top