బ్రెజిల్‌ బేజార్‌

Brazil passes 1 million corona virus cases - Sakshi

10 లక్షలు దాటేసిన కరోనా కేసులు

అధ్యక్షుడు బోల్సనోరా నిర్లక్ష్యమే కొంప ముంచిందా?

కరోనాతో కొంపలేం మునిగిపోవని అనుకున్నారు అదో ఫ్లూ లాంటి జ్వరమేనని ప్రకటనలూ జారీ చేశారు లాక్‌డౌన్, భౌతికదూరం అవసరమే లేదన్నారు బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా వైరస్‌ తీవ్రతను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. కోవిడ్‌ కేసులు 10 లక్షలు దాటిపోతే, మృతులు 50 వేలకు చేరువలో ఉన్నారు.

అగ్రరాజ్యం అమెరికా తర్వాత కరోనా కోరల్లో చిక్కుకొని బ్రెజిల్‌ విలవిలలాడుతోంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనోరా ఏకపక్ష ధోరణితో వైరస్‌ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన సావో పాలో గవర్నర్‌ జాయ్‌ డోరియా  ‘దేశాన్ని పట్టిపీడిస్తున్నది కరోనా వైరస్‌ కాదు. బోల్సనోరా వైరస్‌’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బోల్సనోరా కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అమలు చేసినా వారు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ వైరస్‌ తీవ్రతని తగ్గించి చూపించే ప్రయత్నాలు చేశారు.

జూన్‌ మొదటి వారం నుంచి ప్రతీరోజూ సగటున రోజుకి 30వేల కొత్త కేసులతో మొత్తం కేసులు 10 లక్షలు దాటేశాయి. మృతుల సంఖ్య 50వేలకు చేరువలో ఉంది. అయినప్పటికీ అధ్యక్షుడు బోల్సనోరా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌ అనేదే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం ఇకనైనా బ్రెజిల్‌ ప్రభుత్వం పకడ్బందీగా కోవిడ్‌ కట్టడి చర్యలు చేపట్టకపోతే దేశ ప్రజలు అసహనంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది.

వైరస్‌ వ్యాప్తికి కారణాలివీ
► బ్రెజిల్‌లో ప్రతీ ఏటా ఫిబ్రవరిలో జరిగే కార్నివల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం. అప్పటికే దేశంలో కరోనా జాడలున్నప్పటికీ ఉత్స వాల్ని ఘనంగా జరుపుకున్నారు. భారీగా ప్రజలు గుమికూడి సంబరాలు చేసుకున్నారు. కార్నివాల్‌ జరిగిన మర్నాడే ఫిబ్రవరి 26న దేశంలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగు వారాల్లోనే కేసుల సంఖ్య లక్షకి చేరుకుంది.

► కరోనా సంక్షోభ పరిస్థితిని తట్టుకునే వైద్య సదుపాయాలు దేశంలో లేవు. ఐసీయూలు, ఆక్సిజన్‌ సిలండర్లకు తీవ్ర కొరత నెలకొని ఉంది. కొన్నేళ్లుగా ఆరోగ్యరంగానికి కేటాయింపులు సరిగా జరగడం లేదు. దేశంలో ఏకంగా 40 వేల మంది వైద్య సిబ్బంది కోవిడ్‌ బారినపడ్డారు. ఆరోగ్య రంగంలో మరో లక్ష మందికి కరోనా సోకుతుందనే అంచనాలున్నాయి. వీటన్నింటితో ప్రభుత్వ ఆస్పత్రులే పడకేశాయి. బోల్సనోరా ధోరణితో విసిగిపోయి మూడు నెలల్లోనే ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేశారు.

► దేశంలో కోవిడ్‌ పరీక్షలు సరిగా జరగడం లేదు. కరోనా కట్టడికి అన్ని దేశాలు అనుసరిస్తున్న ప్రధాన సూత్రం ‘ట్రేస్, టెస్ట్, ట్రీట్‌’ను బ్రెజిల్‌ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీ లక్ష మందికి సగటున రోజుకు కేవలం 14 పరీక్షలు జరుగుతున్నాయి.

► దేశంలో నెలకొన్న భారీ ఆర్థిక అసమానతలు కరోనా కేసులను పెంచేస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా కరోనా విస్తరించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొనే స్థోమత కలిగిన వారు దేశ జనాభాలో 20 శాతం మాత్రమే ఉన్నారు. వారు వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

గణాంకాలన్నీ తప్పుడు తడకలు!
బ్రెజిల్‌ కరోనా గణాంకాలన్నీ దాస్తోందన్న అనుమానాలున్నాయి. కోవిడ్‌ కేసుల్ని ట్రాక్‌ చేసే జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ అధికారిక లెక్కల కంటే కేసులు 7 రెట్లు ఎక్కువగా నమోదై ఉండవచ్చునని చెబుతోంది. దీంతో జూన్‌ తొలివారంలో బ్రెజిల్‌ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు అధికారిక గణాంకాలను విడుదల చేయడం మానేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఇవ్వడం ప్రారంభించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-10-2020
Oct 28, 2020, 14:52 IST
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ రాష్ట్రంలోని ఛాతా నాన్‌హెరా గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు కరోనా వైరస్‌ నిర్ధారణ...
28-10-2020
Oct 28, 2020, 10:47 IST
బీజింగ్‌‌: ప్రపంచ వ్యాప్తంగా కరనా వైరస్‌ బారిన పడి ప్రజలు లక్షల్లో మరణించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు...
28-10-2020
Oct 28, 2020, 10:07 IST
న్యూఢిల్లీ: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 15 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు కేంద్రం వెసలుబాటు కల్పించినా.. కొన్ని రాష్ట్రాల్లో...
28-10-2020
Oct 28, 2020, 09:59 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 80 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 43,893 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో...
27-10-2020
Oct 27, 2020, 19:53 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఎంతోమంది జీవనోపాధి పొగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఎందరో ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చేతిలో...
27-10-2020
Oct 27, 2020, 15:06 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని ఒక...
27-10-2020
Oct 27, 2020, 10:19 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,099 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 837...
27-10-2020
Oct 27, 2020, 10:08 IST
భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
27-10-2020
Oct 27, 2020, 08:06 IST
సాక్షి. హైదరాబాద్‌: కరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?... ఆ ప్రమాదం...
27-10-2020
Oct 27, 2020, 03:46 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు భారత బయోటెక్‌ తయారు చేస్తున్న టీకా కోవాగ్జిన్‌ మూడో దశ మానవ ప్రయోగాలు త్వరలో...
26-10-2020
Oct 26, 2020, 18:44 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 51,544 కరోనా...
26-10-2020
Oct 26, 2020, 16:44 IST
న‌టి, నిర్మాత చార్మీ కౌర్ త‌ల్లిదండ్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. అక్టోబ‌ర్ 22న వారికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ...
26-10-2020
Oct 26, 2020, 14:18 IST
న్యూఢిల్లీ : ఇప్పటికే రెండు ట్రయల్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్‌ను కొనసాగిస్తోన్న ‘ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌’ మొదటి విడతను...
26-10-2020
Oct 26, 2020, 11:14 IST
కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్‌ చేయడం ఉత్తమమని ప్రపంచ...
26-10-2020
Oct 26, 2020, 10:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌  విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,09,000 దాటాయి. గడచిన...
26-10-2020
Oct 26, 2020, 08:27 IST
వాషింగ్టన్‌: తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వాక్సిన్‌ అందిస్తానని డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ హామీ ఇచ్చారు. తన సొంతరాష్ట్రం...
25-10-2020
Oct 25, 2020, 16:59 IST
సాక్షి, అమరావతి : గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా వైరస్‌ శాంపిల్స్‌ను‌ పరీక్షించగా.. 2,997 మందికి‌ పాజిటివ్‌గా నిర్థారణ...
25-10-2020
Oct 25, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
25-10-2020
Oct 25, 2020, 04:57 IST
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి...
24-10-2020
Oct 24, 2020, 17:22 IST
సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.  రాష్ట్రంలో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top