‘లెక్కల’ ప్రకారం ప్రపంచ అందగత్తె ఎవరంటే..

Bella Hadid IS World Most Beautiful Woman According to Science - Sakshi

ప్రపంచం మొత్తంలో ఉన్న అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు? అని అడిగితే ఎవరూ చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినా.. ఏటా జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారే ప్రపంచంలోని అందమైన అమ్మాయి అని చెబుతారు. అయితే  ప్రపంచ సుందరిని ఎంపిక చేసేందుకు సరికొత్త విధానం ఉంది. అదే గ్రీక్ మ్యాథమ్యాటిక్స్. గ్రీకు ‘లెక్కల’ ప్రకారం సూపర్ మోడల్ బెలా హదీద్ ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె అని సౌందర్య నిపుణులు అభిప్రాయపడ్డారు. 

అందాన్ని లెక్కించడానికి వాడే ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై ’ప్రకారం ఈ భూమ్మీద ఉన్నవారందరిలో ఈ విక్టోరియా సూపర్‌ మోడలే ప్రపంచ అందగత్తె అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆమె ముఖమే అత్యుత్తమమైనదిగా నిర్ధారణ అయ్యింది. 

క్లాసిక్‌ గ్రీక్‌ కాలిక్యులేషన్‌ను అనుసరించి ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై’  ద్వారా అందానికి నిర్వచిస్తారు. ఇందుకోసం ముఖభాగాన్నికొలుస్తారు. దీని ఆధారంగా అందగత్తె ఎవరన్నదీ తేలుస్తారు. ‘గోల్డెన్ రేషియో’ లెక్కల ప్రకారం 23 ఏళ్ల బెలా ముఖాన్ని లెక్కించగా 94.35 శాతం మ్యాచ్ అయ్యింది. ఆమె తర్వాత స్థానాన్ని 92.44 మార్కులతో పాప్‌ సంచలనం బియాన్స్‌ కొట్టేసింది. 91.85 మార్కులతో హాలీవుడ్‌ నటి ఆంబర్‌ హర్డ్‌  మూడో స్థానంలో నిలిచారు. 

పాప్‌స్టార్‌ బియాన్స్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top