పాక్‌-చైనా భాయిభాయీ!

Bank of China operation in Pakistan - Sakshi

బీజింగ్‌ : భారత్‌ను దెబ్బకొట్టేలా పాకిస్తాన్‌-చైనా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌లోని మసూద్‌ అజర్‌లాంటి ఉగ్రవాదులకు వంత పాడుతున్నా చైనా.. తాజాగా అక్కడ బ్యాంకింగ్‌ సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తన తొలి బ్రాంచ్‌ను కరాచీలో ఆరంభించింది. బ్యాంక్‌ ఆఫ్‌ చైనా బ్రాంచ్‌ ఏర్పాటు సందర్భంగా.. బీజింగ్‌-ఇస్లామాబాద్‌ మధ్య సోదర సంబంధాలు మరింత గట్టిపడతాయని పాకిస్తాన్‌ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్‌-చైనా మధ్య స్నేహసంబంధాల్లో ఇది ఒక మరపురాని ఘట్టమని పాకిస్తాన్‌ అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా చైనా లీడింగ్‌ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ చైనా దక్షిణాసియాలోనే తొలిసారి తన బ్రాంచ్‌ను పాకిస్తాన్‌లో ఏర్పాటు చేయడం గమనార్హం. బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకన్నా ముందుగానే ఇండస్ట్రియల్‌ అండ్‌కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఇప్పటికే పాకిస్తాన్‌లో రెండు బ్రాంచీలు ఏర్పాటు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top