వంద రెట్ల జీతం అదనంగా పొందాడు..!

Australian Employee Paid More Than 100 Times Of His Actual Salary - Sakshi

కాన్‌బెర్రా : నెలంతా కష్టపడి పనిచేస్తేనే పూర్తి జీతం చేతికి రాదు. ఏవో సాకులతో జీతం సోమ్ములోంచి ఎంతో కొంత కట్‌ చేయడం అన్ని కంపెనీల్లో సర్వ సాధారణం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం నెల జీతం కంటే వంద రెట్లు ఎక్కువ వేతనాన్ని పొందాడు. అంత ఎక్కువ జీతం వచ్చిందంటే సదరు ఉద్యోగి ఎంతలా కష్టపడి పనిచేశాడో అనుకుంటే పొరపాటే. అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ తప్పిదం వల్ల ఇంత ఎక్కువ వేతనాన్ని పొందాడు.

వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం 3,582 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(మన కరెన్సీలో 1,84,121.96 రూపాయలు). కానీ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ వారు చేసిన తప్పిదం వల్ల సదరు ఉద్యోగి తన నెల వారీ వేతనం కంటే వంద రెట్లు ఎక్కువ అంటే 3,60,700 ఆస్ట్రేలియన్‌ డాలర్ల(రూ. 1,85,40,701.40) జీతాన్ని పొందాడు. ఈ విషయం గురించి సదరు ఉద్యోగి సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసాడు. దాంతో అధికారులు ఎక్కడ తప్పిదం జరిగిందో చూడగా అసలు విషయం వెలికి వచ్చింది. అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఓ విలువను తప్పుగా ముద్రించారని గుర్తించారు. ఎక్కువ వేతనం పొందడానికి గల కారణం తెలుసుకున్న సదరు ఉద్యోగి నాలుగు వారాల తర్వాత అధికంగా పొందిన వేతనాన్ని తిరిగి ఇచ్చేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top