నైజీరియాలో బొకో హారమ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు రెండు చోట్ల బాంబు దాడులు జరపడంతో 54మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు
మైదుగురి: నైజీరియాలో బొకో హారమ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు రెండు చోట్ల బాంబు దాడులు జరపడంతో 54మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. మరో 90మంది గాయాలపాలయ్యారు. గత జూలై నుంచి ఈ తరహా బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి అని నైజీరియా అధికారులు తెలిపారు.
మైదుగురిలోని అజిలరి అనే ప్రాంతంలో బాంబులు ధరించి వచ్చిన ఓ వ్యక్తి తనను బాంబు విసరడంతోపాటు తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో 54మంది అక్కడికక్కడే చనిపోయారు. గతంలో కూడా మైదుగురి ప్రాంతంలో భారీ స్థాయిలో బాంబు దాడులు చోటుచేసుకుని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.