అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలా! | App that finds like-minded females | Sakshi
Sakshi News home page

అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలా!

Jan 31 2016 7:20 PM | Updated on Sep 3 2017 4:42 PM

అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలా!

అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలా!

మీకు అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలనుకుంటున్నారా అయితే మీరు మొబైల్లో ఓ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే.

న్యూయార్క్: మీకు అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలనుకుంటున్నారా అయితే మీరు మొబైల్లో ఓ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. 'హే! వీనా' పేరుతో ఉన్న ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీలాంటి భావాలే ఉన్న మహిళలను కలుసుకోవచ్చు. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన యాప్ సుమీ. మిగతా ఆన్లైన్ డేటింగ్ యాప్లలా కాకుండా మహిళలు తమతో సారూప్య భావాలున్న వారిని కలుసుకొని రోజువారి జీవితంలో వారికి ఎదురయ్యే సమస్యలు, ప్రయాణాలు, కెరీర్, ఇతర విషయాలను పంచుకోవచ్చు.

చుట్టూ ఎంతమంది ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఆలోచనలు కలవని వారితో స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఈ యాప్ ద్వారా మహిళల మనోగతాన్ని ముందుగా కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకొని అచ్చం వారిలా ఆలోచించే వారిని జత చేస్తామని యాప్ ఫౌండర్ ఒలీవియా జూన్ పూల్ తెలిపారు. ముందుగా యూజర్ల ఫేస్బుక్ అకౌంట్కు హే! వీనా యాప్ కనెక్ట్ అవుతుందని ఆమె తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement