ఆనాటి పాములకు కాళ్లు

Ancient Snakes Had Back Limbs - Sakshi

టొరంటో: పాములకు కోట్ల ఏళ్లక్రితం కాళ్లు ఉండేవని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. సుమారు పది కోట్ల ఏళ్ల క్రితం పాములకు దవడ ఎముకలు ఉండేవని పరిశోధకులు చెప్పారు. ఇప్పటి పాములకు దూరపు చుట్టమైన ‘నజష్‌ రియోనెగ్రినా’ అనే పురాతన సరీసృపం పుర్రె ఒకటి దొరకడంతో వీటి పరిణామ క్రమం అర్థం చేసుకునే వీలు ఏర్పడింది. హై రెజల్యూషన్‌ స్కాన్లతో ఈ పుర్రెను పరిశీలించినప్పుడు ఆనాటి సరీసృపం.. భూ దక్షిణార్ధ గోళంలో ఎక్కువగా కనిపించే ఒక రకం జాతి పాముల పూర్వరూపమని స్పష్టమైంది. కోట్ల ఏళ్ల క్రితం పాములు పెద్దసైజులో ఉండేవని అధ్యయనంలో తేలిందని, ఎక్కువగా వంగగలిగే పుర్రె సాయంతో భారీ సైజు ప్రాణులనూ ఆరగించగలిగేవని ఫ్లిండర్స్‌ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) శాస్త్రవేత్త అలెస్సాండ్రో పాల్కీ తెలిపారు. బల్లుల మాదిరిగా వీటి దవడ ఎముక పూర్తిగా ఏర్పడిందని చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top