ఖరీదైన విడాకులు | Amazon CEO Jeff Bezos to pay out $38B to MacKenzie as divorce settlement | Sakshi
Sakshi News home page

ఖరీదైన విడాకులు

Jul 3 2019 3:36 AM | Updated on Jul 3 2019 3:37 AM

Amazon CEO Jeff Bezos to pay out $38B to MacKenzie as divorce settlement - Sakshi

మెక్‌కెంజీ, జెఫ్‌ బెజోస్‌

వాషింగ్టన్‌: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ భార్యతో కుదుర్చుకున్న విడాకుల ఒప్పందం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఒప్పందం ద్వారా ఆయన భార్య మెక్‌కెంజీకి రూ.2.62 లక్షల కోట్ల (38 బిలియన్‌ డాలర్లు) మొత్తం సొంతం కానుంది. ఈ వారంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారుకానుంది. స్వతహాగా రచయిత అయిన మెక్‌కెంజీ(49) ప్రపంచంలో నాలుగో అత్యంత ధనిక మహిళగా మారారు.

ఈ సంపదలో సగం వారెన్‌ బఫెట్, బిల్‌గేట్స్‌ స్థాపించిన ది గివింగ్‌ ప్లెడ్జ్‌ అనే ధార్మిక సంస్థకే కేటాయించనున్నట్లు గతంలో ఆమె చెప్పారు. అమెజాన్‌ ప్రారంభించటానికి ముందే 1993లో మెక్‌కెంజీకి బెజోస్‌తో వివాహమైంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. జెఫ్‌ బెజోస్‌(55)కు వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు రావడంతో వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.  బెజోస్‌ దంపతులకు అమెజాన్‌లో ఉన్న ఉమ్మడి షేర్లలో 25 శాతం మెక్‌కెంజీకి దక్కనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement