లారీల గడియారం! | All lorry vehicles to 14 made as a clock | Sakshi
Sakshi News home page

లారీల గడియారం!

Sep 26 2016 2:45 AM | Updated on Sep 4 2017 2:58 PM

లారీల గడియారం!

లారీల గడియారం!

టైమెంత? ఊహూ.. మీ వాచీలకేసి చూడకండి. ఫొటో చూసే చెప్పేయవచ్చు. 11 గంటల 2 నిమిషాల 15 సెకన్లు.

టైమెంత? ఊహూ.. మీ వాచీలకేసి చూడకండి. ఫొటో చూసే చెప్పేయవచ్చు. 11 గంటల 2 నిమిషాల 15 సెకన్లు. అయితే ఏంటి అంటారా? ఈ గడియారంలో గంటలు, నిమిషాలు, సెకన్ల ముల్లుల్లా కనిపిస్తున్నాయే... అవన్నీ ముల్లులు కాదు. పెద్దపెద్ద లారీలు. కచ్చితంగా చెప్పాలంటే మొత్తం 14 లారీలున్నాయి. స్వీడన్‌కు చెందిన ట్రక్ తయారీ సంస్థ స్కానియా తమ ఉత్పత్తుల నాణ్యతకు నిదర్శనంగా ఈ ఫీట్‌ను నిర్వహించింది.

ఇందులో గొప్పేముంది.. అనుకుంటే చూడండి... గత వారం దాదాపు 70 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో కంపెనీ ఈ ‘గడియారం ఫీట్’ చేసింది. మొత్తం 90 మంది డ్రైవర్లు ఇందులో పాల్గొన్నారు. 24 గంటలపాటు ఈ లారీలు గడియారం ఆకారంలో తిరిగాయి. నిమిషాల ముల్లులో మధ్యలో ఉన్న లారీ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తిరిగితే... చివరన ఉన్నది కచ్చితంగా గంటకు 53 కిలోమీటర్ల వేగంతో రోజంతా తిరిగిందన్నమాట. వావ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement