‘కహానీలు కాదు..హకానీ అంతు చూడండి’  | Sakshi
Sakshi News home page

‘కహానీలు కాదు..హకానీ అంతు చూడండి’ 

Published Wed, Jan 17 2018 9:48 AM

After suspending military aid, US warns Pak to act against Haqqani network - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ తన భూభాగం నుంచీ హకానీ నెట్‌వర్క్‌, ఇతర ఉగ్రవాద గ్రూపులను ఏరివేయాలని అమెరికా తేల్చిచెప్పింది. ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తున్న క్రమంలో పాకిస్తాన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేసిన అమెరికా తాజాగా పాక్‌ భూభాగంలో ఉగ్రవాదుల ఏరివేతపై అల్టిమేటం ఇచ్చింది. హకానీ నెట్‌వర్క్‌ సహా ఉగ్ర గ్రూపులను నిర్మూలించాలని అమెరికా రాయబారి ఏలిస్‌ విల్స్‌ స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌ను సందర్శించిన ఏలిస్‌ విల్స్‌ ఇస్లామాబాద్‌లో పాక్‌ విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు జరిపారు. హకానీ నెట్‌వర్క్‌ ఆప్ఘన్‌లో భారతీయులు లక్ష్యంగా భీకర దాడులు చేపట్టింది. 2008లో కాబూల్‌లోని ఇండియన్‌ మిషన్‌పై హకానీ దాడుల్లో 58 మంది మరణించారు. ఇక ఆప్ఘన్‌లో అమెరికన్లను టార్గెట్‌గా హకానీ నెట్‌వర్క్‌ పలు దాడులతో చెలరేగింది. పలు మార్లు అమెరికన్లే లక్ష్యంగా హక్కానీ నెట్‌వర్క్‌ కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement