చచ్చాక ఆడుకోడానికని పొరుగువాణ్ని చంపేశాడు! | Sakshi
Sakshi News home page

చచ్చాక ఆడుకోడానికని పొరుగువాణ్ని చంపేశాడు!

Published Sat, Dec 28 2013 3:14 AM

A man kills neighbor due to after death friendship

బీజింగ్: చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన లియావో(54) కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే చచ్చాక ఒంటరివాడి ని అవుతానే మోనన్న బాధ తెగ వేధించింది. అందుకే పొరుగింటి మిత్రుడు (57) కూడా చచ్చిపోతే తోడొస్తాడు కదా! ఎంచక్కా.. ఇద్దరూ కలిసి స్వర్గంలో చెస్ ఆడుకోవచ్చని అనుకున్నాడు. ఇంకేం.. మంగళవారం రాత్రి అతడిని గొంతు నులిమి చంపేశాడు. పక్క గదిలోకి వెళ్లి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమానురాలు అద్దె వసూలు కోసం రావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. లియావో ఎప్పుడూ ఎవరితోనూ కలిసేవాడు కాదని, విపరీత మనస్తత్వంతో కనిపించేవాడని ఆమెను ఉటంకిస్తూ ‘షాంఘై డైలీ’ ఈ మేరకు ఓ కథనంలో పేర్కొంది. అన్నట్టూ.. ఆత్మహత్యకు ముందు లియావో సూసైడ్ నోట్ కూడా రాశాడు. స్వర్గంలో చెస్ ఆడేందుకు తోడుగా ఉంటాడనే పొరుగింటి మిత్రుడిని చంపినట్లు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement