ఓ చల్లని అగ్నిపర్వతం... | A cool volcano | Sakshi
Sakshi News home page

ఓ చల్లని అగ్నిపర్వతం...

May 29 2015 2:59 AM | Updated on Sep 3 2017 2:50 AM

ఓ చల్లని అగ్నిపర్వతం...

ఓ చల్లని అగ్నిపర్వతం...

చిత్ర విచిత్ర కాన్సెప్ట్‌లతో రూపొందిన ఎన్నెన్నో థీమ్ పార్కులను చూసేశాం.

చిత్ర విచిత్ర కాన్సెప్ట్‌లతో రూపొందిన ఎన్నెన్నో థీమ్ పార్కులను చూసేశాం. ఇది సరికొత్తది. ఉష్ణమండల ద్వీపాలతోపాటు ఏకంగా భారీ అగ్నిపర్వతాన్ని తలపించేలా అత్యాధునిక వాటర్ థీమ్ పార్కుకు శ్రీకారం చుట్టారు అమెరికాలో. అగ్నిపర్వతం బద్ధలైతే లావా ఎలా ఎగజిమ్ముతుందో అలాగే నీటిని చిమ్మేలా పార్కును డిజైన్ చేస్తున్నారు.

ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒర్లాండో నగరంలో యూనివర్సల్ స్టూడియోస్, ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ సంస్థలు సంయుక్తంగా యూనివర్సల్ ఓర్లాండో రిసార్ట్‌లో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 2017కల్లా వాటర్‌పార్కును పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని రిసార్ట్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త రిసార్ట్ పేరు ‘వల్కనో బే’.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement