జర్నలిస్ట్‌ల హంతకులకు శిక్షలు పడడం లేదు

90persant of journalist killers have not been convicted - Sakshi

లండన్‌: గత రెండేళ్ల(2017,2018)లో 55% జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావర ణం లేని ప్రాంతాల్లోనే జరిగాయని యునె స్కో ఒక నివేదికలో పేర్కొంది. నేరాలు, అవినీతి, రాజకీయాలపై పాత్రికేయులు జరిపిన రిపోర్టింగ్‌ కారణంగానే ఈ హత్యలు జరిగాయని దీని ద్వారా  స్పష్టమవుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురి కాగా, ఆ హత్యలకు బాధ్యులైన వారిలో 90% మందికి శిక్షలు పడలేదని వెల్లడించింది.

నవంబర్‌ 2ను ‘ఇంటర్నేషనల్‌ డే టు ఎండ్‌ ఇంప్యూనిటీ ఫర్‌ క్రైమ్స్‌ అగైనెస్ట్‌ జర్నలిస్ట్స్‌’ గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో శుక్రవారం ఈ ‘ఇంటెన్సిఫైడ్‌ అటాక్స్, న్యూ డిఫెన్సెస్‌’ అనే నివేదికను విడుదల చేసింది. 2014 కన్నా ముందు ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్యల కన్నా 2014 తరువాతి ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్య లు 18% పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పాత్రికేయుల హత్యల్లో 30% అరబ్‌ దేశాల్లో, 26% లాటిన్‌ అమెరికా కరేబియన్‌ ప్రాంతంలో, 24% ఆసియా పసిఫిక్‌ దేశాల్లో చోటు చేసుకున్నాయని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top