వర్ధమాన శాస్త్రవేత్తలకు అమెరికాలోని ఆల్ఫ్రెడ్ పి స్లోన్ ఫౌండేషన్ ఏటా ఇచ్చే ఫెలోషిప్‌నకు తొమ్మిది మంది భారత అమెరికన్లు ఎంపికయ్యారు.
న్యూయార్క్: వర్ధమాన శాస్త్రవేత్తలకు అమెరికాలోని ఆల్ఫ్రెడ్ పి స్లోన్ ఫౌండేషన్ ఏటా ఇచ్చే ఫెలోషిప్‌నకు తొమ్మిది మంది భారత అమెరికన్లు ఎంపికయ్యారు. 2015 సంవత్సరానికి సంబంధించి ఆ ఫౌండేషన్ అమెరికా, కెనడాకు చెందిన అత్యంత ప్రతిభ కనబర్చిన 126 మంది పరిశోధకులకు ఫెలోషిప్ ప్రకటించింది. వారిలో తొమ్మండుగురు భారత సంతతికి చెందిన అమెరికన్లు ఉన్నారు.
ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి ఒక్కొక్కరికీ 50 వేల డాలర్లు (దాదాపు 31.30 లక్షల రూపాయలు) అందచేయనున్నారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారిలో భారత సంతతికి చెందిన వివేక్ షిండే, నందిని అనంత్, హేమమాల కరుణాదాస, ప్రభల్ దత్తా, నీల్ మన్కడ్, పద్మనీ రంగమణి, శ్యామ్ గొల్లకోట, సంతను జాదవ్, సురేశ్ నాయుడు ఉన్నారు. ఆల్ఫ్రెడ్ పి స్లోన్ ఫౌండేషన్ 1955 నుంచి ఫెలోషిప్స్ ఇస్తోంది.