స్విట్జర్లాండ్‌ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత

59 Percent Of Indians Choose Switzerland As a Holiday Destination - Sakshi

స్విట్జర్లాండ్‌ : మంచు ప్రదేశాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో భారతీయులైతే మరి ముఖ్యంగా ఇష్టపడుతారు. ఈ విషయాన్నే కొన్ని పర్యాటక సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. మంచు ప్రదేశాల పర్యాటక జాబితాలో ముందుండే స్విట్జర్లాండ్‌కు మన భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారంటా. 59 శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో పర్యటించడానికి ఎక్కువగా  స్విట్జర్‌లాండ్‌ను ఎంచుకోవడంలో ఆసక్తిని  చూపుతున్నట్లు క్లబ్‌ మెడ్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ క్లబ్‌ మెడ్‌ సర్వే ప్రకారం సెలవుల రోజుల్లో  భారతీయులు ఎక్కువ మంది  స్విట్జర్లాండ్‌లో  టూరిస్టులుగా ఉంటున్నారని, దాదాపు 96 శాతం భారతీయ ప్రజలు రాబోయే మూడేళ్లలో యురోపియన్‌ మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అధిక సంఖ్యలో భారతీయులు విహరయాత్రకు యురోపియన్‌ మంచు ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజంలో వైవిధ్యమైన, సాహోసోపేతమైన, ప్రయోగత్మకంగా ఉండే మంచు ప్రదేశాల వైపే పర్యటించడానికి భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గ్లోబల్‌ స్నో హాలిడే లీడర్‌, ఆసియా-పసిఫిక్‌ స్నో బ్రాండ్‌ స్టడీ 2019(ఏపీఏసీ) నివేదిక పేర్కొంది.

ఆసియా-పసిఫిక్‌ మంచు క్రీడలను భారతీయులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు.
స్నో బోర్డింగ్‌, స్కైయింగ్‌ స్నో రైడింగ్‌లు అత్యంత ప్రజాదరణ పోందిన మంచు క్రీడలు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌-మోర్టిజ్‌ రోయ్‌ సోలైల్‌, ఇటలీలోని సెర్వినియా, ఫ్రాన్స్‌లోని లెస్‌ డ్యూక్స్‌లోని కోన్ని మంచు ప్రదేశాలు స్నో స్కైయ్‌ డ్రైవింగ్‌ పర్యాటక ప్రదేశాలు. ఈ  ప్రదేశాలకు ప్రతి ఏటా 75 శాతం భారతీయులు వస్తున్నారని, వారు కేవలం స్నో డ్రైవింగ్‌ కోసమే ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారని ఏపీఏసీ సర్వే వెల్లడించింది.

ప్రయాణంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత
ప్రయాణ విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబంతో కలసి పర్యటించడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తెలింది. అన్ని వయసుల వారు సరదగా గడపడానికి, అనుగుణంగా ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. సోలోగా టూరీస్టుల కంటే 27 శాతం భారతీయులు మూడు తరాలతో కుటుంబీకులతో కలిసి పర్యాటించేందుకు ఇష్టపడే భారతీయులు 27 శాతం ఉన్నారని, ఇది ఆసియా-పసిఫీక్‌ సగటు 18 శాతాన్ని అధిగమించినట్లు వెల్లడైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top