తైవాన్లో సోమవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.6 పాయింట్లుగా నమోదైనట్టు చైనా భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.
తైవాన్లో సోమవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.6 పాయింట్లుగా నమోదైనట్టు చైనా భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 22.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 121.7 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూ అంతర్భాగంలోని 10 కిలోమీటర్లలోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప ప్రభావంతో తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగినట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని తైవాన్ ప్రభుత్వం తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.