34 మంది ఉగ్రవాదులు అరెస్టు | 34 terror suspects arrested in Algeria | Sakshi
Sakshi News home page

34 మంది ఉగ్రవాదులు అరెస్టు

Apr 27 2016 8:39 AM | Updated on Sep 3 2017 10:53 PM

34 మంది ఉగ్రవాదులు అరెస్టు

34 మంది ఉగ్రవాదులు అరెస్టు

ఉగ్రవాదులకు సహకరించిన 34 మంది అనుమానిత ఉగ్రవాదులను అల్జీరియా సైన్యం అరెస్టు చేసింది.

అల్జీర్స్: ఉగ్రవాదులకు సహకరించిన 34 మంది అనుమానిత ఉగ్రవాదులను అల్జీరియా సైన్యం అరెస్టు చేసింది. టిజి ఓజో, ఎల్ క్వీడ్ ప్రావిన్స్లలో ఉగ్రవాదుల అలికిడి ఎక్కువగా ఉందని, అందుకు కారణం అక్కడ ఉన్న కొంతమంది సహకరిస్తుండటం వల్లే అలా జరుగుతోందని, అందుకే కొంతమందిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది.

ఉగ్రవాద చర్యల గురించి ఆరా తీయగా ఎల్ క్వీడ్ ప్రాంతంలో వారికి సంబంధించిన సమాచారం లభించిందని, దాంతో పోలీసుల సహాయం తీసుకొని తాము దాడులు నిర్వహించామని, ఈ క్రమంలో 34మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిటనట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement