పోర్టాప్రిన్స్లో పడవ నీట మునిగి దాదాపు 21 మంది మరణించారు.
హైదరాబాద్: పోర్టాప్రిన్స్లో పడవ నీట మునిగి దాదాపు 21 మంది మరణించారు. వివరాలు.. హైతీలోని ఉత్తర కోస్ట్లో గురువారం తెల్లవారుజామున ఓ పడవ ప్రయాణికులతో బయలుదేరింది. గురువారం అర్ధరాత్రి తర్వాత పడవ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని
అధికారులు తెలిపారు. పడవ ప్రయాణానికి ప్రతికూల వాతావరణం ఎదురు కావటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోందని అధికారులు
వెల్లడించారు. 21 మృతదేహాలను గుర్తించారు. ఇంకా మిగిలిన వారిని వైద్యం కోసం బోర్న నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు.